OnePlus | శుక్రవారం నుంచి వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్స్.. గరిష్టంగా రూ.10 వేల వరకూ డిస్కౌంట్.. ఇవీ డిటైల్స్..!
OnePlus | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. భారత్ లో శుక్రవారం నుంచి మొదలయ్యే డిస్కౌంట్ సేల్‌లో గరిష్టంగా రూ.10 వేల వరకూ ధరలు తగ్గిస్తోంది.
OnePlus | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. భారత్ లో శుక్రవారం నుంచి మొదలయ్యే డిస్కౌంట్ సేల్‌లో వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ ఫోన్లు వన్ ప్లస్ 12 (OnePlus 12), వన్ ప్లస్ 12ఆర్ (OnePlus 12R), వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4).. డిస్కౌంట్ ధరలకు లభిస్తాయి. ఇక వన్ ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ ‘వన్ ప్లస్ ఓపెన్’ తోపాటు వన్ ప్లస్ పాడ్, వాచ్ 2, బడ్స్ ప్రో2 కూడా తక్కువ ధరలకే లభిస్తాయి.ఈ నెల ఆరో తేదీ నుంచి 11 వరకూ వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్స్ ప్రారంభం అవుతాయి. వన్‌ప్లస్ ఆన్లైన్ స్టోర్, అమెజాన్, దేశవ్యాప్తంగా ఆఫ్ లైన్ స్టోర్లలో డిస్కౌంట్ ధరలపై ఫోన్లు లభిస్తాయి. వీటితోపాటు వైర్ లెస్ హెడ్ సెట్లు, కంపెనీ స్మార్ట్ వాచ్, టాబ్లెట్ మోడల్స్ మీద ధరల తగ్గింపు ఆఫర్ చేస్తోంది వన్ ప్లస్.
కొత్తగా ఆవిష్కరించిన వన్ ప్లస్ 12 గ్లాసియల్ వైట్ ఎడిషన్ మీద రూ.3000 డిస్కౌంట్, రూ.2000 కూపన్ డిస్కౌంట్ లభిస్తాయి. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.64,999 కాగా, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. వన్ ప్లస్ 12ఆర్ ఫోన్ ధర రూ.39,999 కాగా, బ్యాంక్ డిస్కౌంట్ రూ.2000, కూపన్ డిస్కౌంట్ రూ.2000తోపాటు రూ.6000 ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. జియో పోస్ట్ పెయిడ్ యూజర్లు ఈ రెండు ఫోన్లు కొనుగోలు చేస్తే రూ.2250 బెనిఫిట్లు లభిస్తాయి.
ఇక వన్ ప్లస్ ఓపెన్ ఫోన్ కొనుగోలుపై రూ.5000 బ్యాంక్ డిస్కౌంట్, 12 నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఫోల్డబుల్ ‘ఫోన్ వన్ ప్లస్ ఓపెన్’ కొనుగోలు చేసిన వారికి కాంప్లిమెంటరీ గిఫ్ట్ గా వన్ ప్లస్ వాచ్ 2 లభిస్తుంది. ఇంకా వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ కొనుగోలుదారులకు రూ.2000 బ్యాంక్ ఇన్ స్టంట్ డిస్కౌంట్, సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. వన్ ప్లస్ పాడ్, వన్ ప్లస్ పాడ్ గో లపై రూ.3000 వరకూ డిస్కౌంట్ కూపన్లు లభిస్తాయి. వీటితోపాటు టాబ్లెట్లు, వన్ ప్లస్ వాచ్ 2, వన్ ప్లస్ బడ్స్ 2 ప్రోలపై డిస్కౌంట్ ఆఫర్లు సేల్స్ సమయంలో లిస్ట్ చేస్తుంది. తమ వస్తువుల కొనుగోలుదారులు వన్ ప్లస్ అధికారిక కమ్యూనిటీ సేల్ పేజీలోకి వెళ్లి డీల్స్ చెక్ చేసుకోవాలని వన్ ప్లస్ సూచించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘స్పెషల్’ పెట్టకుండానే బాదుడు.. బస్ పాయింట్లలో కనిపించని రెగ్యులర్ బస్సులు!
Cyber Attack | సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
Stock Market Tips | స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Israel Elections | నెతన్యాహు భవితవ్యం ఏంటో.. రేపే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

