దేశీ మార్కెట్లో త్వరలో వన్‌ప్లస్ 9ఆర్టీ లాంఛ్

న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో త్వరలో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 9ఆర్టీ లాంఛ్ అవుతుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ 9ఆర్టీ ధర రూ 25,000 ఉంటుందని అంచనా. అక్టోబర్ 15న వన్‌ప్లస్ 9ఆర్టీ గ్లోబల్ లాంఛ్ ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ 23,000 నుంచి టాప్ మోడల్ ధర రూ 35,000 వరకూ ఉండవచ్చని టెక్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు. మూడు కలర్ ఆప్షన్స్‌లో రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 9ఆర్‌ను పోలిస డిజైన్‌తోనే కస్టమర్ల ముందుకు వస్తుందని అంచనా.

ఇక 6.55 ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ప్లేతో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ పవర్ వంటి ఫీచర్లతో ఆకట్టుకోనుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సెటప్‌తో కూడిన 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం, ప్రైమరీ లెన్స్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సర్, 16మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సర్ వంటి ఫీచర్లు అలరించనున్నాయి. 5జీ సపోర్ట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వంటి ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో మార్కెట్లో సందడి చేయనుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

