OnePlus 10R 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ తన `వన్ ప్లస్ 10ఆర్ 5జీ (OnePlus 10R 5G)` ఫోన్‌పై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నది. గతేడాది ఏప్రిల్‌లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించినప్పుడు ఈ ఫోన్ ధర రూ.38,999. ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ఎస్వోసీ చిప్సెట్ విత్12 జీబీ ఎల్పీడీడీఆర్6 రామ్‌తో అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 10ఆర్ 5జీ (OnePlus 10R 5G) ఫోన్ 8జీబీ రామ్ విత్ 128 ఇంటర్నల్ స్టోరేజీ, 12 జీబీ రామ్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లుగా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.
వన్ ప్లస్ 10ఆర్ 5జీ ఫోన్ ఆక్సిజన్ ఓఎస్ 12.1 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 12 వర్షన్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ + (1,080×2,412 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ప్లే విత్ 120 హెర్ట్జ్ డైనమిక్ రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ప్రొటెక్షన్ కోసం 2.5డీ కర్వ్డ్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. వన్ ప్లస్ 10ఆర్ ఫోన్ 80వాట్ల సూపర్ చార్జింగ్ ఆఫర్ చేస్తుంది.
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌లో 50మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 766 ప్రైమరీ సెన్సర్, 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 సెన్సర్, 2-మెగా పిక్సెల్ జీసీఓ2ఎంఐ మాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16-మెగా పిక్సెల్ శాంసంగ్ ఐఎస్ఓ సెల్ ఎస్5కే3పీ9 సెన్సర్ ఉంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ సపోర్ట్స్ 80వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ ఉంటుంది. డ్యుయల్ స్టీరియో స్పీకర్లు, నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కలిగి ఉంటది.
ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్‌లో రూ.34,999లకే సొంతం చేసుకోవచ్చు.
దీనిపై రూ.4,000 కూపన్ బేస్డ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. అంటే ఈ ఫోన్ ధర రూ.30,999.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే, ఈఎంఐ లావాదేవీలు నిర్వహిస్తే అదనంగా రూ.1500 డిస్కౌంట్ పొందొచ్చు.
వన్ ప్లస్ 10ఆర్ 5జీ ఫోన్ ధర రూ.29,499. ఎక్స్చేంజ్ ఆఫర్లో గరిష్టంగా రూ.32,999 వరకు రాయితీ లభిస్తుంది.
టాప్ హై ఎండ్ వేరియంట్ వన్ ప్లస్ 10ఆర్ 5జీ ఫోన్ విత్ 12 జీబీ రామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఆవిష్కరణ ధర రూ.42,999.
అమెజాన్ ఈ-కామర్స్ సంస్థలో రూ.38,999 ధరకే లిస్టయింది.
కూపన్ డిస్కౌంట్‌తో కలుపుకుని రూ.34,999కు దిగి వస్తుంది.
ఏ బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేసినా మరో రూ.2000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంటుంది.
వన్ ప్లస్ 10ఆర్ 5జీ ఫోన్ మీద ఫ్లిప్ కార్డు 19 శాతం డిస్కౌంట్ ఇస్తున్నది. దీంతో ఈ ఫోన్ ధర రూ.31,495లకే లభిస్తుంది. రూ.5249 పే చేసి, ఈఎంఐ ఆప్షన్ల కింద ఫోన్ కొనుక్కోవచ్చు. డీబీఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, కొటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.