Ola to grocery delivery | గ్రాసరీ డెలివరీ సర్వీసుల్లోకి ఓలా.. స్విగ్గీ.. బిగ్బజార్లతో సై అంటే సై !
Ola to grocery delivery | ఓలా గ్రాసరీ డెలివరీలోకి ప్రవేశించింది. దీనికి స్విగ్గీ, డుంజోతోపాటు బిగ్‌బజార్ గట్టిపోటీ ఇవ్వనున్నాయి.

Ola to grocery delivery | ఆన్లైన్ క్యాబ్ అగ్రిగేటర్, బెంగళూరు కేంద్రంగా సేవలందిస్తున్న ఓలా.. గ్రాసరీ డెలివరీ సర్వీసులోకి అడుగు పెట్టింది. ఒక ఈ-కామర్స్ సంస్థ నిర్వహిస్తున్న స్టోర్ నుంచి సదరు గ్రాసరీ వస్తువులను కస్టమర్లకు డెలివరీ చేయనున్నది. ఇప్పటికే ఈ రంగంలో డామినేట్ పొజిషన్లో ఉన్న టెక్ స్టార్టప్స్ డుంజో, స్విగ్గీలతోపాటు సంప్రదాయ సూపర్‌మార్కెట్ చైన్ కల బిగ్ బజార్ వంటి సంస్థలు కూడా ఈ-కామర్స్‌లో గ్రాసరీ డెలివరీ సేవల్లోకి ఎంటరవుతున్నాయి. ఈ నేపథ్యంలో శరవేగంగా అభివృద్ధి చెందడంతోపాటు తీవ్ర పోటీనెదుర్కొంటున్న ఈ-కామర్స్ బిజినెస్‌లో అడుగు పెట్టేందుకు ఓలా చేస్తున్న రెండో ప్రయత్నం ఇది.
ప్రస్తుతం ఈ-కామర్స్ బిజినెస్ కస్టమర్లకు 30 కోట్ల డాలర్ల విలువ గల గ్రాసరీ వస్తువులను సరఫరా చేస్తున్నది. వచ్చే నాలుగేండ్లలో 500 కోట్ల డాలర్లకు ఈ-కామర్స్ బిజినెస్ దూసుకెళ్లనున్నది. ఆర్డర్ చేసిన గంటలోపే కస్టమర్లకు సేవలందించడానికి ఈ-కామర్స్ బిజినెస్ సిద్ధం అవుతున్నది. ఐదారేండ్ల క్రితమే ఓలాతోపాటు దాని ప్రత్యర్థి ఉబెర్.. ఈ-కామర్స్ బిజినెస్‌లో గ్రాసరీ సరఫరా చైన్ ఏర్పాటు చేయడానికి విఫలప్రయత్నాలు చేశాయి. కానీ ప్రస్తుతం ఈ-కామర్స్ బిజినెస్ కేవలం గ్రాసరీల రవాణాకు మాత్రమే పరిమితం కాలేదని ఓలా అంచనాకు వచ్చింది.
హోంకేర్, పర్సనల్ కేర్, పెట్‌కేర్, కూరగాయలు, పాలు తదితర వస్తువులను ఈ గ్రాసరీ పంపిణీ జాబితాలో చేర్చవచ్చునని ఓలా వర్గాలు తెలిపాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశీయ క్యాబ్ సర్వీసుల మార్కెట్ ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ-కామర్స్ బిజినెస్‌లో గ్రాసరీ డెలివరీ సేవలందించాలని ఓలా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Grocery Delivery
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

