మిస్డ్ కాల్‌తో కొత్త గ్యాస్ కనెక్షన్ పొందొచ్చు.. ఎలాగంటే?!
మిస్డ్ కాల్‌తో కొత్త గ్యాస్ కనెక్షన్ | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. మిస్డ్ కాల్ ఇచ్చిన కస్టమర్లకు న్యూ వంట గ్యాస్ కనెక్షన్, కొత్త సిలిండర్ ....

న్యూఢిల్లీ: మీకు వంట గ్యాస్ (ఎల్పీజీ గ్యాస్) కనెక్షన్ కావాలా.. అయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తే సరి.. మీకు గ్యాస్ కనెక్షన్ ఇస్తోంది దేశంలోనే అతిపెద్ద ముడి చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ). మీరు మీ మొబైల్ నంబర్ నుంచి 84549 55555 అనే నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. ఇప్పటికే ఐవోసీఎల్ కస్టమర్లై ఉంటే.. వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది.
ఐవోసీ ఆధ్వర్యంలో మిస్డ్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్
మిస్డ్ కాల్ ఫెసిలిటీతో వంట గ్యాస్ కనెక్షన్ పథకాన్ని ఐవోసీ చైర్మన్ ఎస్ఎం వైద్య ప్రారంభించారు. దేశంలో ఎక్కడ నివసిస్తున్నా మిస్డ్ కాల్ ఇస్తే వారి ఇంటికే గ్యాస్ కనెక్షన్ అందిస్తామని ఐవోసీ ఓ ప్రకటనలో తెలిపారు. కస్టమర్ల ఇంటి వద్దకే డబుల్ బాటిల్ (రెండు సిలిండర్ల) కనెక్షన్ (డీబీసీ)ను కూడా ప్రారంభించారు.
దీని కింద సింగిల్ బాటిల్ (సిలిండర్) కనెక్షన్ (ఎస్బీసీ) కస్టమర్లు తమ కనెక్షన్‌ను డీబీసీలోకి మార్చుకునేందుకు వెసులుబాటు లభిస్తుంది. ఆసక్తి గల ఖాతాదారులు రెగ్యులర్ 14.2 కిలోల సిలిండర్‌కు బదులు ఐదు కిలోల సిలిండర్‌ను కూడా ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఐవోసీ మాత్రమే మిస్డ్ కాల్‌తో కొత్త గ్యాస్ కనెక్షన్ లేదా సిలిండర్ బుకింగ్ అందచేసే ఫెసిలిటీ కలిగి ఉన్నది.
వృద్ధులు.. గ్రామీణులకు ఇలా బెనిఫిట్
గత జనవరిలో ఎంపిక చేసిన మార్కెట్ల పరిధిలో మిస్డ్ కాల్‌తో కొత్త గ్యాస్ కనెక్షన్, దేశవ్యాప్తంగా సిలిండర్ బుకింగ్ ఫెసిలిటీని ఐవోసీ తీసుకొచ్చింది. మిస్డ్ కాల్ వల్ల ఖాతాదారుల సమయం ఆదా అవుతుందని పేర్కొంది ఐవోసీ. కొత్త కనెక్షన్ కోసం ఉచితంగా, సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఈ ఫెసిలిటీ వల్ల వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బెనిఫిట్ కలుగుతుంది. టెక్నాలజీ సాయంతో వంట గ్యాస్ బుకింగ్, చెల్లింపులను ఐవోసీ సరళతరం చేసింది.
ఇలా కూడా బుకింగ్.. పేమెంట్
“భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్), ఇండియన్ ఆయిల్ వన్ యాప్ లేదా https://cx.indianoil.in” అనే పోర్టల్ ద్వారా గానీ కస్టమర్లు తమ ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లు 75888 88824 అనే వాట్సాప్ నంబర్, 7718955555 అనే నంబర్‌తో ఎస్సెమ్మెస్/ ఐవీఆర్ఎస్ చేసి గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు.. పేమెంట్ చేయొచ్చు. అమెజాన్ లేదా పేటీఎం చానెళ్ల ద్వారా చెల్లింపులు జరుపొచ్చని ఐవోసీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి:
Neeraj Chopra Workout : నీరజ్ చోప్రా ‘పసిడి’ రహస్యమిదే..?!
pace Wedding : అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్‌లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
Ujjwala 2.0 : ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించిన మోదీ
HP Envy Laptops : హైఎండ్ ఫీచర్లతో హెచ్‌పీ 11th Gen లాప్టాప్స్.. 16.5 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో
Lionel Messi: ఫ్రీగా ఆడతానన్నా మెస్సీ బార్సిలోనాలో కొనసాగడం కుదరదు.. ఎందుకు?
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

