Nokia XR20 : భారత్ మార్కెట్లోకి రానున్న నోకియా తొలి 5జీ ఫోన్!

న్యూఢిల్లీ : భారత్‌లో తొలి నోకియా 5జీ ఫోన్‌ను హెచ్ఎండీ గ్లోబల్ ఈనెలలో లాంఛ్ చేయనుంది. అక్టోబర్ 20న నోకియా ఎక్స్ఆర్20 ప్రీబుకింగ్స్ తమ వెబ్సైట్లో ఓపెన్ అవుతాయని నోకియా ఇండియా ప్రకటించింది. ప్రీలాంఛ్ ఆఫర్ కింద ఫోన్‌తో పాటు నోకియా పవర్ ఇయర్‌బడ్స్ లైట్, ఏడాది పాటు స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు హెచ్ఎండీ గ్లోబల్ వెల్లడించింది.

ఇక భారత్‌లో సీ30 స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంఛ్ చేస్తామని నోకియా ఇండియా ప్రకటించింది. నోకియా ఎక్స్ఆర్20 డ్రాప్ రెసిస్టెంట్..స్క్రాచ్ రెసిస్టెంట్..టెంపరేచర్ రెసిస్టెంట్..వాటర్ రెసిస్టెంట్ ఫోన్‌గా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఎక్స్ఆర్20 భారత్‌లో 6జీబీ ర్యామ్, 128జీబీ ఆర్ఓఎం వెర్షన్లో అందుబాటులో ఉంటుంది. ఫుల్ హెచ్‌డీప్లస్ స్క్రీన్, బ్యాక్ ప్యానెట్‌లో టూ కెమెరా సెటప్‌తో 6.67 ఇంచ్‌ల ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.

4630ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఫుల్ చార్జితో ఫోన్ రెండు రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 5జీ చిప్సెట్తో అందుబాటులోకి రానున్న నోకియా ఎక్స్ఆర్20 ధర రూ 38,000 నుంచి రూ 42,000 మధ్య అందుబాటులో ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- new launch
- Nokia 5G
- NokiaXR20
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

