సవాళ్లను ఒడిసిపట్టి గెలవాలి
దేశీయ మైనింగ్ రంగం ఎదురొంటున్న సవాళ్లను ఇంజినీర్లు అవకాశాలుగా మలుచుకోవడం ద్వారా జీడీపీ అభివృద్ధికి కృషి చేయాలని ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ పిలుపునిచ్చారు.
- ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ పిలుపు
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): దేశీయ మైనింగ్ రంగం ఎదురొంటున్న సవాళ్లను ఇంజినీర్లు అవకాశాలుగా మలుచుకోవడం ద్వారా జీడీపీ అభివృద్ధికి కృషి చేయాలని ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఎన్ఎండీసీ కార్యాలయంలో సోమవారం జరిగిన మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఈఏఐ) హైదరాబాద్ చాప్టర్ జనరల్‌బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. దేశంలో గుర్తించబడిన మైనింగ్ నిల్వలు 22 శాతం ఉన్నాయని, వాటిలో సమగ్ర అన్వేషణ జరిగినవి 6 శాతం మాత్రమేనని, వీటిలో ప్రస్తుతం 2 శాతంలో మాత్రమే మైనింగ్ జరుగుతున్నదని తెలిపారు.
అభివృద్ధి పథంలో దేశం ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ 2 శాతాన్ని రెట్టింపు చేస్తే జీడీపీలో మైనింగ్ రంగం వాటా 4 శాతానికి చేరుతుందని చెప్పారు. సమావేశంలో అసోసియేషన్ జాతీయ మాజీ అధ్యక్షులు ఎండీ ఫషీయుద్దీన్, వీడీ రాజగోపాల్, ఎంఈఏఐ సెక్రటరీ జనరల్ నరసయ్య, హైదరాబాద్ చాప్టర్ మాజీ అధ్యక్షుడు బీఆర్వీ సుశీల్ కుమార్, ఎన్ఎండీసీ టెక్నికల్ డైరెక్టర్ వినయ్‌కుమార్, కమర్షియల్ డైరెక్టర్ విశ్వనాథ్ సురేశ్, ప్రొడక్షన్ డైరెక్టర్ దిలీప్‌కుమార్ మహంతి తదితరులు పాల్గొన్నారు.
కొత్త కమిటీ చైర్మన్‌గా వినయ్‌కుమార్
ఈ సమావేశంలో ఎన్ఎండీసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వినయ్‌కుమార్, ఉపాధ్యక్షునిగా డాక్టర్ ఎమ్మెస్ వెంకట్రామయ్య, కార్యదర్శిగా ఎల్ కృష్ణ, సంయుక్త కార్యదర్శిగా వీ బాలకోటిరెడ్డి, కోశాధికారిగా డాక్టర్ ఎస్కే సింహంతోపాటు 9 మంది సభ్యులు ఎన్నికయ్యారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

