Nike Layoffs | పేటీఎం బాటలోనే ‘నైక్’.. వందల మందికి ఉద్వాసనలు..?!
Nike Layoffs | ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం’ బాటలోనే ప్రముఖ గ్లోబల్ స్పోర్ట్ వేర్ సంస్థ ‘నైక్’ పొదుపు చర్యల్లో భాగంగా వందల మంది ఉద్యోగులకు ‘లే-ఆఫ్స్’ ప్రకటించనున్నట్లు తెలిపింది. కొన్ని విభాగాల్లో ఆటోమేషన్ సేవలను ఉపయోగించుకోవాలని తల పోస్తున్నది.
Nike Layoffs | కార్పొరేట్ సంస్థలను మాంద్యం భయం వెంటాడుతున్నది. టెక్నాలజీ.. రిటైల్.. ఫ్యాషన్.. ఫలానా రంగం అని చెప్పలేం.. వివిధ రంగాల కంపెనీలు పొదుపు చర్యలు చేపట్టాయి. అందరూ సరికొత్త ఆశలు, ఆకాంక్షలతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతుంటే.. కార్పొరేట్లు.. తమ సిబ్బందికి ‘లేఆఫ్’ షాక్‌లిస్తున్నాయి.
ఇప్పటికే ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం’.. వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ బాటలోనే గ్లోబల్ స్పోర్ట్స్ వేర్ సంస్థ ‘నైక్’ పయనిస్తోంది. నూతన సంవత్సరం ప్రారంభమయ్యే లోపు వందల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపింది. గతేడాది పూర్ సేల్స్ నమోదైన నేపథ్యంలో 200 కోట్ల డాలర్లు (రూ.16 వేల కోట్లు) ఆదా చేయాలని నైక్ సంకల్పించినట్లు తెలుస్తున్నది.
సంస్థ క్రమబద్ధీకరణ, ఉద్వాసనకు గురైన ఉద్యోగుల కోసం 450 మిలియన్ డాలర్లు (రూ.3,742 కోట్లు) ఖర్చు చేయాలని నైక్ తీర్మానించుకున్నది. మరోవైపు, తమ కంపెనీ లావాదేవీల్లో ఆటోమేషన్ సేవలు ఉపయోగించుకోవాలని నిర్ణయానికి వచ్చింది. గత మూడు నెలలుగా ఒకశాతం సేల్స్ పెరిగినా.. తమ రిటైల్ బిజినెస్ పై అనిశ్చితి కొనసాగుతున్నదని భావిస్తున్నది. కరోనా మహమ్మారి వేళ 2020లో 700 మందిని నైక్ తొలగించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

