న్యూఢిల్లీ : స్ర్కాంబ్లర్, కేఫ్ రేసర్ మేళవింపుతో రొనిన్ బైక్‌ను టీవీఎస్ మోటార్ గురువారం లాంఛ్ చేసింది. బేస్ వేరియంట్ రూ 1.49 లక్షల ప్రారంభ ధరకు, బేస్ ప్లస్ వేరియంట్ రూ 1.56 లక్షలకు, మిడ్ వేరియంట్ రూ 1.69- రూ 1.71 లక్షలకు అందుబాటులో ఉంటుంది.
ముందు భాగంలో స్పై ఇమేజ్‌ల్లో కనిపించిన తరహాలోనే రొనిన్ రౌండ్ హెడ్‌లైట్ క్లస్టర్‌తో ఆకట్టుకుంటుంది. ఇన్సెట్ టీ షేప్ డీఆర్ఎల్, టియర్ డ్రాప్ ట్యాంక్, బ్లాక్డ్ అవుట్ మెకానికల్ బిట్స్‌తో బాడీ వర్క్ మ్యాచ్ చేశాఉ. బేస్ వేరియంట్లో లైటెనింగ్ బ్లాక్, మాగ్మా రెడ్ కలర్స్, బేస్ ప్లస్‌లో డెల్టా బ్లూ, స్టార్‌గేజ్ బ్లాక్ షేడ్స్ కలర్స్‌లో ఈ బైక్ కస్టమర్ల ముందుకొచ్చిందని టీవీఎస్ తెలిపింది.
మిడ్ వేరియంట్ గెలాక్టిక్ గ్రే, డాన్ ఆరంజ్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. యూఎస్బీ చార్జర్, స్మార్ట్ ఎక్సోనెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ సిస్టం, టర్న్ బై టర్న్ నేవిగేషన్, వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్లు వంటి పలు స్పెసిఫికేషన్లతో రొనిన్ ఆకట్టుకుంటుంది. అర్బన్, రెయిన్ అనే రెండు మోడ్స్‌లో, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌ను కలిగిఉంది.