న్యూఢిల్లీ : 2022 న్యూ హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను జూన్ 16న లాంఛ్ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఫ్రంట్, రియర్ సైడ్ రీడిజైన్ లుక్‌తో, ఇంటీరియర్స్ మైనర్ అప్‌గ్రేడ్స్‌తో న్యూ హ్యుందాయ్ వెన్యూ కస్టమర్ల ముందుకు రానుంది. హ్యుందాయ్ క్రెటా ఇన్స్పిరేషన్తో న్యూ వెన్యూను డెవలప్ చేసినట్టు కంపెనీ తెలిపింది. యూనిక్ డిజైన్‌తో ఆల్ న్యూ గ్రిల్‌తో లేటెస్ట్ వెహికల్ ఆకట్టుకోనుంది.
డీఆర్ఎల్లతో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్‌తో న్యూ హ్యుందాయ్ వెన్యూ వినూత్న లుక్‌తో ఆకట్టుకుంటుందని కంపెనీ పేర్కొంది. రియర్ బంపర్‌పై కూడా స్టైలిష్ లుక్ ప్రతిబింబించేలా రీవర్క్ చేసినట్టు తెలిపింది. న్యూ వెన్యూ న్యూ అలాయ్ వీల్స్‌ను కలిగిఉంది. న్యూ ట్రిమ్, కలర్స్‌తో 2022 హ్యుందాయ్ వెన్యూ అప్‌గ్రేడెడ్ ఇంటీరియర్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా ముందుకు రానుంది.
2022 హ్యుందాయ్ వెన్యూ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తే కియా సొనెట్, టాటా నెక్సాన్, అప్‌కమింగ్ 2022 మారుతి సుజుకి విటారా బ్రెజా వంటి వెహికల్స్‌కు దీటైన పోటీ ఇవ్వనుంది. బ్లాక్‌బస్టర్ ప్రోడక్ట్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా భారత్‌లో నూతన బెంచ్‌మార్క్‌లను హ్యుందాయ్ నెలకొల్పిందని, న్యూ వెన్యూ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎండీ, సీఈఓ ఉన్సూ కిమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.