H-1 B Visa | అలాగైతే డాలర్ డ్రీమ్స్‌కు రాంరాం.. మళ్లీ హెచ్1బీ రూల్స్ చేంజ్?
H-1 B Visa | బీటెక్ పూర్తి చేసుకున్న ఇంజినీర్లు.. అమెరికాలో హెచ్-1బీ వీసా కింద ఉద్యోగాలు పొందడం మున్ముందు కష్టమేనంటున్నారు.

H-1 B Visa | మీరు ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లి.. హెచ్-1బీ వీసా కింద ఉద్యోగం సంపాదించుకోవాలని అనుకుంటున్నారా.. అయితే మున్ముందు కష్టాలు ప్రారంభమవుతున్నట్లేనని సంకేతాలు వస్తున్నాయి. హెచ్-1 బీ వీసా కింద తమదేశంలోకి రావాలని భావించే విదేశీయుల ఎంట్రీకి అమెరికా నిబంధనలను కఠినతరం చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు అమెరికా టెక్ వర్క్పోర్స్ యాక్ట్-2021 అంటూ ఓ బిల్లును ప్రజాప్రతినిధుల సభలో ఇటీవల ప్రవేశపెట్టారు. ఇది చట్ట రూపం ధరిస్తే టెక్ నిపుణులు, ఔత్సాహిక ఐటీ ఇంజినీర్లు అమెరికా వెళ్లాలన్న డ్రీమ్‌కు నీళ్లొదులుకోవాల్సిందేనన్న సందేహాలు వస్తున్నాయి.
ఓపీటీ ఆప్షన్‌కు రాంరాం
హెచ్-1 బీ వీసా పొందడానికి ముందు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కింద మూడేండ్ల పాటు స్టూడెంట్ వీసా పొందే ఆప్షన్ ఉండేది. కానీ ప్రతిపాదిత చట్టం ఆమోదం పొందితే ఇప్పుడు స్టెమ్ క్వాలిఫికేషన్ గల విదేశీ విద్యార్థులు ఓపీటీ కింద మూడేండ్ల పని చేసుకునే వెసులుబాటు ఉండదు.
హెచ్-1బీతో పెద్ద కంపెనీలకే మేలు
హెచ్-1బీ వీసా కార్యక్రమం ప్రత్యేకించి పెద్ద కంపెనీలకు మాత్రమే బెనిఫిట్ చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. చౌక ధరకు విదేశీ వర్కర్లను నియమించుకోవడానికి ఆయా టెక్ దిగ్గజాలకు పన్ను రాయితీలు అందుతాయి. అసలు అమెరికా లేబర్మార్కెట్లో గ్యాప్‌ను భర్తీ చేయడానికి వీసా విధానాన్నే రద్దు చేయాలని హెచ్-1బీ మద్దతుదారులు అంటున్నారు.
పెద్ద టెక్ కంపెనీలకు కళ్లెం వేయడానికేనా?
పెద్ద టెక్ కంపెనీలకు అకౌంటబిలిటీ తేవడానికి ఏర్పాటైన రిపబ్లికన్ స్టడీ కమిటీ చైర్మన్ జిమ్ బ్యాంక్స్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ట్రంప్ హయాంలో అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి చట్టంలో మార్పులు తెచ్చారు. కానీ బిడెన్ హయాంలోనూ ట్రంప్ వారసత్వాన్ని కొనసాగించేందుకు జిమ్ బ్యాంక్స్ ప్రయత్నిస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత ప్రజా ప్రతినిధుల సభ, అటుపై సెనెట్ క్లియరెన్స్ ఆమోదిస్తే ఈ బిల్లు చట్టరూపం సంతరించుకుంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

