న్యూయార్క్ : ప్రకటనలతో కూడిన చవకైన సబ్స్క్రిప్షన్ ప్లాన్స్‌ను లాంఛ్ చేయనున్నట్టు ఆన్లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. పడిపోతున్న పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్యతో పాటు రాబడిని పెంచుకునేందుకు కంపెనీ ఈ దిశగా చర్యలు చేపట్టింది. చవక సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ లాంఛ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సారండస్ కేన్స్ లయన్స్ అడ్వర్టైజింగ్ ఫెస్టివల్ వేదికగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ ఈ ప్లాన్స్‌ను యూజర్ల ముందుకు తీసుకువస్తుందని గతంలో న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. కంపెనీ ఇటీవల 2 లక్షల పెయిడ్ సబ్‌స్ర్కైబర్లను కోల్పోయిందని నెట్‌ఫ్లిక్స్ ఇటీవల పేర్కొన్న క్రమంలో స్ట్రీమింగ్ దిగ్గజం నూతన సబ్స్క్రైబర్ల కోసం కసరత్తు సాగిస్తోంది. సబ్స్క్రైబర్ల సంఖ్య వేగంగా పడిపోతుండటంతో నెట్‌ఫ్లిక్స్ ఇటీవల 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది.
యాడ్ సపోర్టెడ్ ప్లాన్స్‌తో అటు ఆదాయం, ఇటు సబ్స్క్రైబర్లను పెంచుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ సన్నద్ధమైంది. చీపర్ సబ్స్క్రిప్షన్లతో సబ్స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని కంపెనీ ఆశిస్తోంది. తక్కువ ధరకు సబ్స్క్రిప్షన్ కోరుకుని యాడ్స్ చూసేందుకు సిద్ధమయ్యే వారికి ఈ ప్లాన్స్ అనుకూలంగా ఉంటాయని నెట్‌ఫ్లిక్స్ సీఈవో చెబుతున్నారు.