నాస్డాక్ కంప్యూటర్లో పట్టనంత పెరిగిన బఫెట్ కంపెనీ షేరు ధర

న్యూయార్క్: మీరు చదివింది నిజమే. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథవే షేరు ధర రికార్డు స్థాయికి చేరింది. ఎంతలా అంటే ఈ ధర చూపెట్టడానికి నాస్డాక్ ఏకంగా తన కంప్యూటర్ సిస్టమ్‌నే అప్‌గ్రేడ్ చేయాల్సి వస్తోంది. ఈ కంపెనీ క్లాస్ ఎ షేరు ధర మంగళవారం 4,21,000 డాలర్లను మించిపోయింది. అది గురువారం ఉదయానికి 4,29,172 డాలర్లకు చేరింది. ఇది నాస్డాక్ కంప్యూటర్లు చూపించగలిగే గరిష్ఠ విలువ అయిన 4,29,496.7295కు కొన్ని వందల డాలర్ల దూరంలోనే ఉంది.
మంగళవారమే బెర్క్‌షైర్ హాథవే షేరు ధర చూపించడాన్ని నాస్డాక్ తాత్కాలికంగా నిలిపేసింది. నాస్డాక్ కంప్యూటర్లు లెక్కించే విధానం, అది వాడే కాంపాక్ట్ డిజిటల్ ఫార్మాట్ కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు ద వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. 32 బిట్స్ ఉపయోగించే కాంపాక్ట్ కంప్యూటర్ ఫార్మాట్లో నాస్డాక్ స్టాక్ ధరలను రికార్డు చేస్తుంది. ఆ లెక్కన ఇందులో పట్టే అతి పెద్ద నంబర్ 2^32-1. అంటే గరిష్ఠంగా 4,294,967,295. ఇక స్టాక్ ధరలు తరచూ నాలుగు డెసిమల్ స్థానాల వరకూ స్టోర్ చేస్తారు. ఆ లెక్కన గరిష్ఠ స్టాకు ధర $429,496.7295ను మాత్రమే నాస్డాక్ కంప్యూటర్ సిస్టమ్ చూపించగలుగుతుంది.
ఇప్పుడు బెర్క్‌షైర్ హాథవే షేరు ధర దీనికి దగ్గరగా రావడంతో నాస్డాక్ తన కంప్యూటర్ సిస్టమ్‌లో దానిని చూపించడం ఆపేసింది. ఈ నెల 17న తన కంప్యూటర్ను అప్‌గ్రేడ్ చేసి సమస్యను పరిష్కరిస్తామని నాస్డాక్ వెల్లడించింది. నాస్డాక్ చరిత్రలో ఓ కంపెనీ షేరు ధర దీనికి దగ్గరగా రావడం ఇదే తొలిసారి. స్టాక్‌ను స్ల్పిట్ చేయడానికి సంస్థ చైర్మన్ వారెన్ బఫెట్ నిరాకరించడంతో దీని ధర పెరుగుతూ వెళ్లి ఇప్పుడీ స్థాయికి చేరింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

