NABARD | రాష్ట్రాభివృద్ధిలో నాబార్డ్ కీలక పాత్ర
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో నాబార్డ్ కీలకపాత్ర పోషించిందని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నాబార్డ్) తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ చింతల సుశీల్ అన్నారు. 43వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ..
- తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల
NABARD | హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో నాబార్డ్ కీలకపాత్ర పోషించిందని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నాబార్డ్) తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ చింతల సుశీల్ అన్నారు. 43వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పథకాలలో నాబార్డ్ భాగస్వామ్యం కావడం గర్వకారణంగా ఉందన్నారు. నాబార్డు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడంతోపాటు ఇంక్యూబేషన్ సెంటర్లతో స్టార్టప్లను ప్రోత్సహించడానికి పలు చర్యలు తీసుకుంటున్నదన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక, ప్రణాళికాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు మాట్లాడుతూ..నాబార్డు ప్రోత్సాహాంతో పంటలపైన కాకుండావ్యవసాయ అనుబంధ రంగాలైన పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, ఫిషరీస్ తదితర రంగాలద్వారా కూడా ఆదాయం గణనీయంగా పెరుగుతున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి తలసరి ఆదాయంలో 10వ స్థానంలో ఉన్న రాష్ట్రం, ప్రస్తుతం మూడో స్థానానికి ఎగబాకిందన్నారు. ఈ సందర్భంగా టీఎస్సీఏబీ అధ్యక్షుడు ఎం రవీందర్ రావు మాట్లాడుతూ.. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురసరించుకుని నాబార్డ్ గ్రాస్ రూట్ స్థాయిలో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

