Myntra CEO Resigns | మింత్రా సీఈవోగా అమర్ నాగారం గుడ్‌బై
Myntra CEO Resigns | ఫ్లిప్‌కార్ట్ అనుబంధ మింత్రా సీఈవోగా అమర్నాగారం రాజీనామా చేశారు. డిసెంబర్ వరకు ఆ పదవిలో కొనసాగుతారు.

Myntra CEO Resigns | ఫ్లిప్‌కార్ట్ అనుబంధ ఫ్యాషన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమర్ నాగారం తన పదవికి రాజీనామా చేశారు. తన సొంత వెంచర్ పనులు చేపట్టేందుకు వైదొలుగుతున్నట్లు తెలిపారు. మింత్రా పంపిన రాజీనామా లేఖను ఫేస్బుక్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తన సభ్యులకు ఈ-మెయిల్ చేశారు. అయితే, తన తర్వాత సంస్థ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు డిసెంబర్ వరకు మింత్రా సీఈవోగా కొనసాగుతారు. తర్వాత సలహాదారుగా వ్యవహరిస్తానని తెలిపారు. ఈ విషయాన్ని మింత్రా వర్గాలు ధృవీకరించాయి. మూడేండ్ల క్రితం మింత్రా సీఈవోగా అమర్ నాగారం బాధ్యతలు చేపట్టారు.
దాదాపు మూడేండ్లుగా మింత్రాకు సారధ్యం వహించిన తర్వాత అమర్ తన సొంత పనుల నిమిత్తం ఫ్లిప్‌కార్ట్‌ను వీడాలని నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌లో వివిధ టీమ్‌లకు సారధ్యం వహించిన అమర్.. గ్రూప్‌లో సమగ్ర భాగస్వామిగా వ్యవహరించారు. ఫ్లిప్ కార్ట్‌లో ఆయన సేవలను మేం మిస్ అవుతున్నాం అంటూ కల్యాణ్ కృష్ణమూర్తి తన ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో తెలిపారు. 2019లో మింత్రా అండ్ జబోంగ్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన అమర్ నాగారం.. ఫ్లిప్‌కార్ట్‌లో ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- amar nagaram
- Myntra
RELATED ARTICLES
తాజా వార్తలు
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

