MobiKwik IPO | రేపు మొబిక్విక్ ఐపీఓ ప్రారంభం.. షేర్ ధరెంతంటే..?!
MobiKwik IPO | ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ (Mobikwik) ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)కు వెళ్లనున్నది. బుధవారం మొబిక్విక్ ఐపీఓ ప్రారంభం కానున్నది.
MobiKwik IPO | ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ (Mobikwik) ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)కు వెళ్లనున్నది. బుధవారం మొబిక్విక్ ఐపీఓ ప్రారంభం కానున్నది. ఐపీఓలో మొబిక్విక్ షేర్ ధర రూ.265-279 మధ్య ఖరారు చేసింది. ఈ ఐపీఓ ద్వారా రూ.572 కోట్ల నిధులు సేకరించాలని మొబిక్విక్ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నెల 11 నుంచి 13 మధ్య ఐపీఓ సాగుతుంది. ఇన్వెస్టర్లు మొబిక్విక్ ఐపీఓలో ఒక లాట్లో 53 షేర్లు కొనుగోలు చేయాలి. ఐపీఓ నేపథ్యంలో గ్రే మార్కెట్లో మొబిక్విక్ షేర్లు రూ.132 ధరపై ట్రేడ్ అవుతున్నాయని స్టాక్ మార్కెట్ల పరిశీలకులు చెబుతున్నారు. మొబిక్విక్ ఐపీఓలో దాఖలైన బిడ్లకు శనివారం నాడు షేర్లు కేటాయించే అవకాశం ఉంది. ఒకవేళ ఏ కారణం వల్లనైనా ఆలస్యం జరిగితే షేర్ల కేటాయింపు 16న జరుగుతుంది.
రూ.572 కోట్ల నిధుల్లో కంపెనీ ఫైనాన్సియల్ సర్వీసెస్ బిజినెస్ వృద్ధి కోసం రూ.150 కోట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం రూ.107 కోట్లు, పేమెంట్ సర్వీసుల విస్తరణకు రూ.135 కోట్లు, అదనంగా రూ.70.2 కోట్లు చెల్లింపు వస్తువులు, కార్పొరేట్ అవసరాల కోసం ఖర్చు చేయాలని మొబిక్విక్ ప్రణాళిక రూపొందించింది. ఈ ఐపీఓ మేనేజర్లుగా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్ వ్యవహరిస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

