న్యూఢిల్లీ, డిసెంబర్ 6: దేశవ్యాప్తంగా లక్షకుపైగా సాఫ్ట్వేర్ డెవలపర్లకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇచ్చి సర్టిఫై చేయనున్నది. ‘ఫ్యూచర్ రెడీ చాంపియన్స్ ఆఫ్ కోడ్’ కింద నెల రోజులపాటు ఈ తరగతులు జరుగుతాయని మంగళవారం సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ సందర్భంగా సాఫ్ట్వేర్ డెవలపర్ల క్రియేటివిటి, ఇన్నోవేషన్, ప్యాషన్లను మైక్రోసాఫ్ట్ ప్రోత్సహించనున్నది. కాగా, యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఓయో, ఉడా న్, ఇన్మొబీ, ఐసర్టీస్, పేయూ, వర్సే ఇన్నోవేషన్, వింబో తదితర మైక్రోసాఫ్ట్ కస్టమర్లు, భాగస్వాములు ఈ కార్యక్రమానికి మద్దతునివ్వనున్నారు.