MG Comet EV | రూ.8 లక్షలకే ఎంజీ ఎలక్ట్రిక్ కారు.. మూడేండ్ల ఫ్రీ సర్వీస్.. ప్రీ-బుకింగ్స్ ఎప్పటి నుంచంటే..?!
MG Comet EV | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా ఈవీ కారు రూ.7.98 లక్షలకు లభిస్తుంది. 15 నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అవుతాయి.
MG Comet EV | ఎంజీ మోటార్ ఇండియా ఎట్టకేలకు భారత్ మార్కెట్లోకి రానున్న `కొమెట్ ఈవీ` ధరలు వెల్లడించింది. ఈ నెల 15 నుంచి ఈ కార్లపై ఆసక్తి గల వారు ప్రీ-బుకింగ్స్ చేసుకోవచ్చు. కార్లు బుక్ చేసుకున్న వారికి ఈ నెల 22 నుంచి దశల వారీగా డెలివరీ చేయనున్నది. ఎంజీ కొమెట్ ఈవీకారు పేస్ వేరియంట్ ధర రూ.7.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ హై ఎండ్ కారు ప్లస్ వేరియంట్ ధర రూ.9.98 లక్షలు పలుకుతుంది. ఈ ధరలు తొలి 5000 బుకింగ్స్‌కు మాత్రమే వర్తిస్తాయని ఎంజీ మోటార్ ఇండియా తెలిపింది.
ఈ-షీల్డ్ ఓనర్ షిప్ ప్యాకేజీతో ఎంజీ కొమెట్ ఈవీ లభ్యం అవుతుంది. ఇందులో మూడేండ్ల స్టాండర్డ్ / లక్ష కి.మీ దూరం వరకు వారంటీ, మూడేండ్ల పాటు ఉచితంగా సర్వీస్, మూడేండ్ల పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఎనిమిదేండ్లు లేదా 1.20 లక్షల కి.మీ. వరకు బ్యాటరీపై వారంటీ ఆఫర్ చేస్తున్నది. మూడేండ్ల బైబ్యాక్ ప్లాన్ కూడా అందిస్తున్నది. ఎంజీ కొమెట్ మూడు వేరియంట్లలో లభ్యం అవుతుంది. అవేమిటంటే.. ఫేస్, ప్లే, ప్లస్ వేరియంట్లలో సొంతం చేసుకోవచ్చు. వాటి ధరలు ఇలా ఉన్నాయి.
వేరియంట్ —– ధర (రూ.ల్లో)
పేస్ ———- 7.98 లక్షలు
ప్లే ———— 9.28 లక్షలు
ప్లష్ ———– 9.98 లక్షలు
మూడు వేరియంట్లలో ఫీచర్లు
ఎంజీ కొమెట్ ఈవీ పేస్ వేరియంట్.. ఫుల్ డిజిటల్ క్లస్టర్ విత్ 10.25 అంగుళాల ఎంబీడెడ్ ఎల్ఈడీ స్క్రీన్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, పవర్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంస్ వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది.
ప్లే వేరియంట్ 10.25- అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తోపాటు ఐ-స్మార్ట్ విత్ 55+ కనెక్టెడ్ కార్ ఫీచర్లు, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే ఫీచర్లు కలిగి ఉంటుంది.
హై స్పెక్ ప్లస్ వేరియంట్ కారు గ్రే క్యాబిన్ థీమ్, ఫ్లోటింగ్ ట్విన్ డిస్ ప్లే, 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, పవర్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంస్, రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ సెన్సర్స్, స్మార్ట్ స్టార్ట్ సిస్టమ్, డిజిటల్ కీ విత్ బ్లూ టూత్ టెక్నాలజీ, ఐ-స్మార్ట్ విత్ 55కి పైగా కనెక్టెడ్ కారు ఫీచర్లతో వస్తున్నది.
ఎక్స్టీరియర్.. ఇంటీరియర్ ఫీచర్లు ఇవే
ఎంజీ కొమెట్ ఈవీ కారు ఎక్స్టీరియర్గా ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ అండ్ టెయిల్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ స్ట్రిప్ రన్నింగ్ ఎక్రాస్ విడ్త్ ఆఫ్ ది కార్ ఎట్ ది ఫ్రంట్ అండ్ రేర్ ఫీచర్ కలిగి ఉంటుంది. 12-అంగుళాల స్టాండర్డ్ స్టీల్ వీల్స్ ఉంటాయి. ఇంటీరియర్‌గా 2-స్పోక్ స్టీరింగ్ వీల్ విత్ పాడ్ లైక్ కంట్రోల్స్, ఫ్లోటింగ్ డ్యూయల్ 10.25 అంగుళాల స్క్రీన్ ఫర్ ఏ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 12-వీ చార్జింగ్ పోర్ట్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. కొమెట్ ఈవీ టాప్ ఎండ్ కారు.. డిజిటల్ బ్లూ టూత్ కీ ఫంక్షనల్లీ ఫర్ షేరింగ్ అప్ టూ 2 పీపుల్తోపాటు 55+ కనెక్టెడ్ ఫీచర్లు ఉంటాయి. ఈ కారు ఎకో, నార్మల్, స్పోర్ట్ మోడ్ల్లో లభిస్తుంది.
బ్యాటరీ కెపాసిటీ ఇలా
ఎంజీ కొమెట్ ఈవీ కారు 17.3 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీతో వస్తున్నది. ఇది ఒకసారి చార్జింగ్ చేస్తే 230 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. రేర్ యాక్సిల్ మౌంటెడ్ పీఎంఎస్ ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటర్ గరిష్టంగా 41.1 హెచ్‌పీ పవర్, 110 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఏడు గంటల్లో 100 శాతం, ఐదు గంటల్లో 10-80 శాతం ఈ బ్యాటరీ రీచార్జీ అవుతుంది.
ఇలా సేఫ్టీ ఫీచర్లు
సేఫ్టీ కోసం డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రేర్ పార్కింగ్ కెమెరా విత్ సెన్సర్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, రేర్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ కలిగి ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

