MG Comet EV Special Gamer | సింగిల్ చార్జింగ్ తో 230 కి.మీ ప్రయాణం.. మార్కెట్లోకి ఎంజీ కొమెట్ ఈవీ స్పెషల్ గేమర్
MG Comet EV Special Gamer | ఎంజీ మోటార్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి తన కొమెట్ ఈవీ స్పెషల్ గేమర్ ఎడిషన్ కారు తీసుకొచ్చింది. ప్రస్తుత వర్షన్‌తో పోలిస్తే రూ.64,999 ఎక్కువ.
MG Comet EV Special Gamer | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి కొమెట్ ఈవీ (Comet EV) స్పెషల్ గేమర్ ఎడిషన్ (Special Gamer Edition) తీసుకొచ్చింది. దీని ధర రూ.8.65 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. కొమెట్ ఈవీలో పేస్, ప్లే, ఫ్లష్ వేరియంట్లతో పోలిస్తే స్పెషల్ గేమర్ ఎడిషన్ వేరియంట్ ధర రూ.64,999 ఎక్కువ.
గత మే నెలలో ఎంజీ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లో తొలుత రూ.7.98 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరకు లాంచ్ చేసింది. టాటా టియాగో ఈవీ కారుతో పోలిస్తే సుమారు రూ.50 వేలు తక్కువ. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 230 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. ఆసక్తి గల వారు ఆన్లైన్లో గానీ, ఎంజీ డీలర్ షిప్‌ల వద్ద గానీ రూ.5000 పే చేసి బుక్ చేసుకోవచ్చు.
రెండు డోర్ల కారు కొమెట్ ఈవీ ఫ్రంట్‌లో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎంజీ లోగో, డే టైం రన్నింగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్ @ రేర్, 12-అంగుళాల ఎయిరోడైనమికల్లీ డిజైన్డ్ స్టీల్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, రేర్ పార్కింగ్ కెమెరా తదితర ఫీచర్లు ఉంటాయి. ఎంజీ మోటార్ ఇండియా నుంచి ‘ఎంజీ జడ్ఎస్ ఈవీ’ తర్వాత రెండో ఈవీ కొమెట్ ఈవీ స్పెషల్ గేమర్ కారు.
ఫోల్డబుల్ స్ప్లిట్ సీట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఐదు రంగుల్లో (ఆపిల్ గ్రీన్ విత్ బ్లాక్ రూఫ్, అరోరా సిల్వర్, స్టారీ బ్లాక్, క్యాండీ వైట్, క్యాండీ వైట్ విత్ బ్లాక్ రూప్) కొమెట్ ఈవీ స్పెషల్ గేమర్ ఎడిషన్ కారు ఆవిష్కరించారు. రెండు డోర్లతో వస్తున్న కొమెట్ ఈవీ స్పెషల్ గేమర్ ఎడిషన్ కారులో నలుగురు కూర్చునే వెసులుబాటు ఉంటుంది.
కొమెట్ ఈవీ స్పెషల్ గేమర్ ఎడిషన్ కారు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆపిల్ ఐపాడ్‌తో పని చేసే కంట్రోల్స్ ఉంటాయి. ఆడియో, నేవిగేషన్, ఇన్ఫోటైన్మెంట్ వాయిస్ కమాండ్స్ వంటి అంశాలను కంట్రోల్ కమాండ్ ఆప్షన్లు నియంత్రిస్తాయి.
బ్యాటరీకి ఎనిమిదేండ్లు లేదా 1.20 లక్షల కి.మీ వారంటీ కోసం రూ.5000 పే చేయాలి. మూడేండ్లు లేదా లక్ష కి.మీ వరకు స్టాండర్డ్ వారంటీ, మూడేండ్ల లేబర్ ఫ్రీ సర్వీస్, మూడేండ్ల రోడ్ సైడ్ అసిస్టెన్స్ తదితర ఆప్షన్లు కల్పిస్తారు. కొమెట్ ఈవీ స్పెషల్ గేమర్ ఎడిషన్ కారుతో మూడేండ్లలో 60 శాతం బై బ్యాక్ ప్లాన్ కూడా ఆఫర్ చేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

