Medtronic | హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగంలో రారాజు.. మెడ్‌ట్రానిక్
మెడికల్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరొందిన మెడ్‌ట్రానిక్.. ఔషధ నగరి హైదరాబాద్‌లో విస్తరణపై దృష్టి పెట్టింది. 74 ఏండ్ల క్రితం మొదలైన ఈ అమెరికన్ మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీ.. ప్రస్తుతం 150కిపైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.
- మెడికల్ డివైజెస్ తయారీలో దిగ్గజం
- 150కిపైగా దేశాల్లో కార్యకలాపాలు
- లక్ష మంది ఉద్యోగులు
Medtronic | మెడికల్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరొందిన మెడ్‌ట్రానిక్.. ఔషధ నగరి హైదరాబాద్‌లో విస్తరణపై దృష్టి పెట్టింది. 74 ఏండ్ల క్రితం మొదలైన ఈ అమెరికన్ మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీ.. ప్రస్తుతం 150కిపైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకునే మెడ్‌ట్రానిక్.. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఫార్మా హబ్ హైదరాబాద్‌లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే సుమారు రూ.3,000 కోట్ల పెట్టుబడితో ఇప్పటికే ఇక్కడున్న మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (ఎంఈఐసీ) అభివృద్ధికి సిద్ధమైంది.

హెల్త్‌కేర్‌లో దిట్ట
దాదాపు ఏడున్నర దశాబ్దాల క్రితం అమెరికాలోని మిన్నీపోలిస్లో ఓ మెడికల్ ఎక్విప్మెంట్ రిపేర్ షాప్‌గా మొదలైన మెడ్‌ట్రానిక్ ప్రస్థానం.. నయా హెల్త్‌కేర్ టెక్నాలజీలు, థెరపీల పరిశోధన వైపు నడిచింది. ఈ క్రమంలోనే ఆరోగ్య సంరక్షణ రంగంలో సంచలనాలు సృష్టిస్తూ రకరకాల మెడికల్ డివైజ్‌లను తయారు చేసింది. నేడు ప్రపంచ మార్కెట్లో వీటికి విశేష ఆదరణ లభిస్తున్నదంటే.. మెడ్‌ట్రానిక్ టెక్నాలజీ, అది రూపొందించిన డివైజ్‌ల పనితీరుపై ఎంతటి నమ్మకమున్నదో అర్థం చేసుకోవచ్చు.
ఏ టు జెడ్ సమస్యలకు..
మెడ్‌ట్రానిక్ తయారు చేసే ఉత్పత్తులు హెల్త్‌కేర్ ఇండస్ట్రీలోని అన్ని విభాగాల్లో అడుగడుగునా వినియోగించేవే. అడ్వాన్స్డ్ సర్జికల్ టెక్నాలజీ, కార్డియాక్ రిథమ్, కార్డియాక్ వాస్క్యులర్, బ్రెయిన్ ఫంక్షన్, పేషెంట్ మానిటరింగ్ డివైజ్‌లతోపాటు డయాబెటిస్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఈఎన్టీ, జనరల్ సర్జరీ, గైనకాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, డెంటల్, ఆర్థో, రెస్పిరేటరీ సంబంధిత చికిత్సలకు వినియోగించే పరికరాలను మెడ్‌ట్రానిక్ తీసుకొస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే శరీరంలోని అన్ని అవయవాల సమస్యల పరిష్కారానికి మెడ్‌ట్రానిక్.. వైద్య రంగానికి సాంకేతికంగా మద్దతునందిస్తున్నది.
హైదరాబాద్‌కు దన్ను
రోబోటిక్స్, ఇమేజింగ్, నావిగేషన్, సర్జికల్-ఇంప్లాంటబుల్ టెక్నాలజీస్ వంటి విభాగాల్లో హైదరాబాద్‌కు మెడ్‌ట్రానిక్ తాజా పెట్టుబడులు మరింత దన్నుగా నిలవగలవని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే ఇంజినీరింగ్, మొబైల్ యాప్స్, అప్లికేషన్, డెస్క్‌టాప్ సాఫ్ట్వేర్, క్లౌడ్/వెబ్ యాప్స్, డాటా ఇంజినీరింగ్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, ప్రోడక్ట్ సెక్యూరిటీ, సైబర్-ప్రోడక్ట్ సెక్యూరిటీ అంశాల్లో నైపుణ్యం, ప్రతిభ కలిగినవారికి మరిన్ని అవకాశాలనూ ఈ పెట్టుబడులు తెచ్చిపెట్టగలవన్న ధీమా వ్యక్తమవుతున్నదిప్పుడు. ఈ క్రమంలోనే మున్ముందు ఇక్కడ పనిచేసేందుకు సుమారు వెయ్యి మంది నిపుణులను సంస్థ నియమించుకోవచ్చన్న అంచనాలున్నాయి.
మెడ్‌ట్రానిక్ ఉత్పత్తుల్లో కొన్ని..
- కార్డియాక్ మానిటర్స్
- బ్రెయిన్ మానిటర్స్
- హార్ట్ వాల్వ్ రిప్లేస్మెంట్స్
- స్టంట్స్
- గ్లూకోజ్ మానిటరింగ్
- ఇన్సూలిన్ పంప్ సిస్టమ్స్
- ఎండోస్కోపిక్ ప్రొడక్ట్స్
- ఈఎన్టీ ఎక్విప్మెంట్స్
- సర్జికల్ స్టాప్లింగ్
- సర్జికల్ నావిగేషన్ సిస్టమ్స్
- బోన్ గ్రాఫ్టింగ్
- పల్స్ ఆక్సీమీటర్
- వెంటిలేటర్ ఫిల్టర్స్
- స్పైన్ రోబోటిక్స్
- రేడియాలజీ ప్రొడక్ట్స్
సంస్థ : మెడ్‌ట్రానిక్
ఏర్పాటు : 1949
పరిశ్రమ : వైద్య పరికరాలు
ప్రధాన కేంద్రం: మిన్నీపోలిస్, అమెరికా
చైర్మన్ : గేయాఫ్ మార్తా
ఆదాయం: 31.69 బిలియన్ డాలర్లు (2022)
నిర్వహణ లాభం: 5.75 బిలియన్ డాలర్లు (2022)
నికర లాభం: 5.04 బిలియన్ డాలర్లు (2022)
మొత్తం ఆస్తులు: 90.98 బిలియన్ డాలర్లు (2022)
ఉద్యోగులు : దాదాపు లక్ష
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

