McKinsey : గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ మెకిన్సే ఉద్యోగుల సంఖ్యను కుదించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఉద్యోగులు ఇతర ఉద్యోగాల కోసం స్వచ్ఛందంగా కంపెనీ నుంచి తప్పుకునే ఆఫర్‌ను ప్రకటించింది.
ఆయా ఉద్యోగులకు తొమ్మిది నెలల పాటు జాబ్ సెర్చ్ పీరియడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ తొమ్మిది నెలల కాలంలో వారికి కంపెనీ పూర్తి వేతనం చెల్లిస్తుంది.
ఈ తొమ్మిది నెలల్లో క్లైంట్ ప్రాజెక్టుల్లో ఉద్యోగులు నిమగ్నం కాకుండా ఇతర ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేపట్టవచ్చు. కార్యాలయ పనిగంటల్లోనూ వీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసే వెసులుబాటు కల్పించింది. వందలాది సీనియర్ ఉద్యోగులకు మెకిన్సే ఈ ఆఫర్ ప్రకటించింది.
Read More :
Leopard | ఢిల్లీలో చిరుత కలకలం.. ఐదుగురిపై దాడి