Google Pay-Master Card | గూగుల్‌పేతో మాస్టర్ కార్డ్ పార్టనర్షిప్.. ఎందుకంటే?!
Google Pay-Master Card | ఆన్లైన్ చెల్లింపుల్లో టోకెనైజేషన్ వ్యవస్థ అమలుకు గూగుల్ పే, మాస్టర్ కార్డ్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.

Google Pay-Master Card | గ్లోబల్ పేమెంట్స్ సంస్థ మాస్టర్ కార్డ్.. యూపీఐ సేవల సంస్థ గూగుల్ పేతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. దేశంలో ఆన్లైన్ పేమెంట్స్ వ్యవస్థను బలోపేతంచేసేందుకు టోకెనైజేషన్ ప్రక్రియ కొన్ని వారాల్లో అమలులోకి రానున్న నేపథ్యంలో ఈ రెండు సంస్థల మధ్య భాగస్వామ్యం ఏర్పడటం ప్రాధాన్యం సంతరించుకున్నది.
ప్రముఖ ఫైనాన్సియల్ పేమెంట్స్ సంస్థ మాస్టర్ కార్డ్, యూపీఐ సేవల సంస్థ గూగుల్‌పేతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.దేశంలో ఆన్ లైన్ లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చేందుకు టోకనైజేషన్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ ప్రతిపాదించిన తెలిసిందే. జనవరి ఒకటో తేదీ నుంచి ఈ వ్యవస్థ అమలులోకి రానున్నది.
ఈ నేపథ్యంలో ఖాతాదారుల క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో సురక్షితంగా ఆన్లైన్ లావాదేవీలు జరిపేందుకు టోకనైజేషన్ విడుదల చేస్తున్నట్లు గూగుల్ పే, మాస్టర్ కార్డ్ ప్రకటించాయి. వినియోగదారులు తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలు నమోదు చేయనవసరం లేకుండా టోకనైజేషన్ ద్వారా సురక్షితమైన డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు.
గూగుల్ పే ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ మాస్టర్ కార్డ్ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా భారత్ క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తోపాటు యాప్‌లో లావాదేవీలు సురక్షితంగా చేయవచ్చు. దీని కోసం వినియోగదారులు గూగుల్ పే యాప్‌లో తమ కార్డు వివరాలను నమోదు చేసి, అనంతరం ఓటీపీని ఎంటర్ చేసి వన్-టైమ్ సెటప్ చేసుకోవాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Google Pay
- master card
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

