అక్టోబర్ 1 నుంచి కార్డ్ నిబంధనలు అమలు
బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్, డెబిట్ కార్డుల జారీకి నిర్దేశించిన నిబంధనల అమలు గడువును రిజర్వ్‌బ్యాంక్ మరో మూడు నెలలు పొడిగించింది.
న్యూఢిల్లీ, జూన్ 21: బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్, డెబిట్ కార్డుల జారీకి నిర్దేశించిన నిబంధనల అమలు గడువును రిజర్వ్‌బ్యాంక్ మరో మూడు నెలలు పొడిగించింది. కార్డ్‌ల జారీపై మాస్టర్ డైరెక్షన్లో నిబంధనలు జూలై 1 నుంచి అమలుకావాల్సి ఉండగా, కొన్ని నిబంధనల అమలుకు గడువుతేదీని పరిశ్రమ భాగస్వామ్య పక్షాల వినతి మేరకు అక్టోబర్ 1కి పొడిగిస్తూ ఆర్బీఐ ఒక సర్క్యులర్ జారీచేసింది. క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్‌కు మరింత సమయాన్ని ఇవ్వడం వంటి నిబంధనల అమలు వాయిదాపడ్డాయి. అవి..
- మాస్టర్ డైరెక్షన్ ప్రకారం కార్డుల్ని జారీచేసే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు..క్రెడిట్ కార్డ్ జారీ అయిన 30 రోజులకుపైబడినా కస్టమర్ యాక్టివేట్ చేసుకోకపోతే, దానిని యాక్టివేట్ చేయడానికి కార్డ్‌హోల్డర్ నుంచి ఓటీపీ ఆధారిత అనుమతిని తీసుకోవాలి.
- అలాగే క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్‌కు ఖాతాదారు నుంచి అనుమతి లభించకపోతే, అందుకు సంబంధించి ఖాతాదారు నుంచి ధృవీకరణ కోరిన తేదీ నుంచి ఏడు రోజుల్లోగా ఖాతాదారుపై ఎటువంటి భారం వేయకుండా క్రెడిట్ కార్డ్ ఖాతాను మూసివేయాలి.
- కార్డ్‌పై మంజూరుచేసిన క్రెడిట్ లిమిట్‌ను కార్డ్‌హోల్డర్ ఏ సమయంలోనూ దాటకుండా కార్డ్ జారీ సంస్థలు చూడాలి.
- చెల్లించని ఛార్జీలు, వాటిపై చక్రవడ్డీని వేయడానికి సంబంధించిన నిబంధన అమలును సైతం ఆర్బీఐ జూలై 1 నుంచి 3 నెలలు వాయిదా వేసింది. మాస్టర్ డైరెక్షన్లో మిగిలిన నిబంధనల అమలుకు నిర్దేశించిన జూలై 1 గడువులో మార్పులేదని రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- master card
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

