April Car Sales | కార్ల సేల్స్‌లో డబుల్ డిజిట్.. ఎస్యూవీలపైనే మోజు!
April Car Sales | ఏప్రిల్ నెలలో మారుతి, హ్యుండాయ్, టాటా మోటార్స్ కార్ల సేల్స్ లో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదవుతుంది.
April Car Sales | ఏప్రిల్ నెలలో మారుతి సుజుకితోపాటు హ్యుండాయ్, టాటా మోటార్స్ సహా వివిధ కార్ల తయారీ సంస్థల విక్రయాల్లో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదైంది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)కే గిరాకీ లభించింది. మారుతి సుజుకి సేల్స్ దేశీయంగా 13 శాతం పెరిగాయి. 2022 ఏప్రిల్‌లో 1,21,995 కార్లు విక్రయించిన మారుతి సుజుకి.. గత నెలలో 1,37,320 కార్లు విక్రయించింది.
కానీ, ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటి మినీ కార్ల సేల్స్ 18 శాతం పడిపోయాయి. 2022 ఏప్రిల్‌లో 17,137 యూనిట్లు అమ్ముడు పోగా, గత నెలలో 14,110 కార్ల విక్రయానికే పరిమితం అయ్యాయి. కంపాక్ట్ సెగ్మెంట్లో స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ తదితర మోడల్ కార్లు 27 శాతం పుంజుకున్నాయి. 2022 ఏప్రిల్‌లో 59,184 కార్లు విక్రయించగా, గత నెలలో 74,935 యూనిట్లే పెరిగాయి. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) మోడల్స్ బ్రెజా, గ్రాండ్ విటారా, ఎర్టిగా సేల్స్ ఎనిమిది శాతం వృద్ధి చెంది 36,754 యూనిట్లకు పెరిగాయి.
దేశీయంగా హ్యుండాయ్ మోటార్ కార్ల సేల్స్‌లో 13 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. 2022 ఏప్రిల్‌లో 44,001 కార్లు విక్రయించగా, గత నెలలో 49,701 యూనిట్లు విక్రయించింది. ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన ఆల్ న్యూ వెర్నా సేల్స్ రెట్టింపుకు పైగా నమోదయ్యాయని హ్యుండాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో మార్కెట్లోకి రానున్న మరో ఎస్యూవీ ఎక్స్టర్తో సేల్స్ మరింత పెరుగుతాయని భావిస్తోంది.
టాటా మోటార్స్ సైతం 2022 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో 13 శాతం సేల్స్ పెంచుకున్నది. గతేడాది ఏప్రిల్‌లో 41,587 కార్లు విక్రయించిన టాటా మోటార్స్ ఈ ఏడాది 47,007 యూనిట్లకు పెంచుకోగలిగింది. దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్స్ సేల్స్ 22 శాతం పెంచుకుని 23,216 యూనిట్ల కార్లు విక్రయించింది. గతేడాది కేవలం 19,019 కార్లు మాత్రమే విక్రయించింది.
టాటా కిర్లోస్కర్ సేల్స్ ఆరు శాతం తగ్గి 14,162 యూనిట్లకు పరిమితం అయ్యాయి. మరోవైపు నిస్సాన్ మోటార్స్ సేల్స్ 24 శాతం వృద్ధితో 2,617 కార్లు విక్రయించింది. ఎంజీ మోటార్ ఇండియా సేల్స్ రెండు రెట్లు పెరిగాయి. గత నెలలో 4,551 కార్లు విక్రయించింది ఎంజీ మోటార్స్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- April
- Business news
- car sales
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

