Starbucks-Zomato | స్టార్‌బక్స్ కేఫ్‌లో జొమాటోకు కాఫీ ఆర్డర్.. డిస్కౌంట్ ఎంతో తెలుసా..?!
Starbucks-Zomato | స్టార్‌బక్స్ కేఫ్‌లో కూర్చునే ఫుడ్ డెలివరీ యాప్‌కు కాఫీ ఆర్డర్ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరలైంది. కానీ, జొమాటో డెలివరీ బాయ్‌కు ఈ సంగతి తెలుసని, ఆశ్చర్యకరమేమీ లేదని స్టార్‌బక్స్ మాల్ ట్వీట్ చేసింది.
Starbucks-Zomato | ఇప్పుడంతా టెక్నాలజీ మయం.. వార్తలు తెలుసుకోవడం మొదలు మనీ చెల్లింపుల వరకూ ప్రతిదీ ఆన్లైన్లోనే పూర్తవుతుంది. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా .. క్యాబ్ సర్వీసులు బుక్ చేసుకోవాలన్నా అంతా ఆన్లైన్లోనే పూర్తవుతుంది. ఆన్లైన్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఇన్ స్టంట్ డిస్కౌంట్లు లభిస్తాయి. ఈ ఆప్షన్‌ను వాడుకోవడంలో యూజర్లు సృజనాత్మకంగా వ్యవహరిస్తుంటారు.
స్టార్‌బక్స్ క్వాలిటీకి మారుపేరు.. ఆయా ఫుడ్స్ ధరలు కూడా ఎక్కువ. కప్ కాఫీ ఆర్డర్ చేస్తే రూ.400 పే చేయాలి. కానీ జొమాటోలో ఆర్డర్ చేయడంతో కేవలం రూ.190లకే లభిస్తుంది. మిగతా డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి. దీన్ని తనకు అనువుగా మార్చుకున్న ఓ వ్యక్తి స్టార్‌బక్స్ కేఫ్ కెళ్లి కాఫీ ఆర్డర్ చేశారు.. ఆగండాగండి.. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో స్టార్ బక్స్ అడ్రస్ తోనే కాఫీ ఆర్డర్ చేశాడు. స్టార్ బక్స్ కేఫ్‌లోనే కూర్చుని ఉన్న సదరు వ్యక్తి రూ.190 పే చేసి.. కాఫీ సేవించానని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. ఈ ఘటన ఈ నెల ఆరో తేదీన జరిగింది.
దీనిపై సంబంధిత స్టార్ బక్స్ మాల్ ట్విట్టర్ ఖాతా పోస్టులతో పూర్తిగా లోడ్ అవుతున్నది. ఈ విషయమై స్పందించిన స్టార్ బక్స్ యాజమాన్యం.. కొందరు కస్టమర్లు కేఫ్‌లో కూర్చునే ఆన్ లైన్లో ఆర్డర్ చేస్తున్న సంగతి జొమాటో డెలివరీ బాయ్ కి తెలుసునని, ఇదేం ఆశ్చర్యకరం కాదని వ్యాఖ్యానించింది. మరో నెటిజన్ స్పందిస్తూ.. డెలివరీ బాయ్ తక్కువ టైంలో సర్వీస్ పూర్తి చేశాడని ట్వీట్ చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

