గూగుల్ కొలువు : 39 సార్లు తిరస్కరించినా 40వ సారి డ్రీమ్ జాబ్ దక్కించుకున్నాడు!
డ్రీమ్ జాబ్‌ను సొంతం చేసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోతే మరో కంపెనీలో ఉద్యోగమో లేకుంటే వ్యాపారంలోనో కుదురుకుంటారు.
న్యూయార్క్ : డ్రీమ్ జాబ్‌ను సొంతం చేసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోతే మరో కంపెనీలో ఉద్యోగమో లేకుంటే వ్యాపారంలోనో కుదురుకుంటారు. ఇందుకు భిన్నంగా 39 సార్లు ఉద్యోగ ప్రయత్నాలు బెడిసికొట్టినా పట్టుదలతో 40వ సారి గూగుల్‌లో కొలువును సాధించాడు టేలర్ కొహెన్. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన కొహెన్ 39 సార్లు సెర్చింజన్ దిగ్గజం తిరస్కరించినా ఏమాత్రం నిరాశపడకుండా ప్రయత్నాలు కొనసాగించడంతో డ్రీమ్ జాబ్‌ను దక్కించుకున్నాడు.
గూగుల్‌తో తన కమ్యూనికేషన్ స్క్రీన్ షాట్‌ను కొహెన్ తన లింక్డిన్ ఖాతాలో షేర్ చేశాడు. గూగుల్‌లో కొలువుతీరకముందు కొహెన్ డోర్‌డ్యాష్ కంపెనీలో స్ట్రేటజీ, ఆపరేషన్స్ అసోసియేట్ మేనేజర్‌గా పనిచేసేవాడు. పట్టుదలకు, అమాయకత్వానికి మధ్య సన్నటి గీత ఉంటుంది..తాను ఈ రెండింటిలో దేన్ని కలిగిఉన్నానో గుర్తించేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నా అంటూ లింక్డిన్లో కొహెన్ రాసుకొచ్చాడు. 39 సార్లు తాను తిరస్కరణకు గురైనా ఒకసారి అంగీకారం ఎదురైందని క్యాప్షన్ ఇచ్చిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. తాను గూగుల్‌కు తొలిసారిగా 2019లో దరఖాస్తు చేశానని మూడేండ్ల తర్వాత జాబ్ దక్కించుకున్నానని కొహెన్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లో ఉంది.
ఎట్టకేలకు గూగుల్‌లో కొలువును దక్కించుకున్నందుకు కొహెన్‌కు లింక్డిన్ యూజర్లు అభినందనలు తెలపగా దిగ్గజ టెక్ కంపెనీల్లో తమకు ఎదురైన అనుభవాలను మరికొందరు పంచుకున్నారు. తాను అమెజాన్‌లో 120 సార్లకు పైగా అప్లై చేసుకోగా ఎట్టకేలకు జాబ్ దక్కించుకున్నానని ఓ యూజర్ రాసుకొచ్చాడు. ఓ వ్యక్తి తనను పెండ్లి చేసుకోవాలని తన గర్ల్‌ఫ్రెండ్‌ను 40 సార్లు ఎన్నడూ అడిగిఉండడని మరో యూజర్ జోక్ చేశాడు. కొహెన్ తన సామర్ధ్యాన్ని గ్రహించాలని ఊరికే ఓ కంపెనీ వెంటపడటం తగదని మరికొందరు యూజర్లు విమర్శించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

