Ban on Companies | చైనా కంపెనీలకు భారత్ షాక్.. పవర్ బ్యాంక్ కంపెనీలపై నిషేధం..!
Ban on Companies | గత కొద్ది సంవత్సరాలుగా చైనా కంపెనీలపై భారత్ కొరఢా ఝుళిపిస్తున్నది. 2020లో మొదలైన చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్ నాణ్యత లేని పవర్ బ్యాంకులు విక్రయిస్తున్న రెండు చైనా కంపెనీలపై చర్యలు చేపట్టింది.
Ban on Companies | గత కొద్ది సంవత్సరాలుగా చైనా కంపెనీలపై భారత్ కొరఢా ఝుళిపిస్తున్నది. 2020లో మొదలైన చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్ నాణ్యత లేని పవర్ బ్యాంకులు విక్రయిస్తున్న రెండు చైనా కంపెనీలపై చర్యలు చేపట్టింది. లిథియం బ్యాటరీలను దిగుమతి చేసుకుంటున్న రెండు ప్రధాన కంపెనీలపై భారత ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టగా.. మూడో కంపెనీపై విచారణ జరుపుతున్నది. చైనా నుంచి దిగుమతి అవుతున్న నాసిరకం పవర్ బ్యాంక్‌ల అమ్మకాలు పెరుగుతున్న నేపథ్యంలో కీలక చర్యలు చేపట్టింది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న అనేక పవర్ బ్యాంకులు.. కంపెనీ క్లెయిమ్ చేసిన సామర్థ్యంలో కేవలం 50-60శాతంతో మాత్రమే పని చేస్తున్నాయి. భారతీయ కంపెనీలు ఈ తక్కువ నాణ్యత బ్యాటరీలను చౌక ధరలకు కొనుగోలు చేసి.. మార్కెట్లు ఉత్పత్తులను చౌకగా విక్రయిస్తున్నాయి. ఈ చర్య మార్కెట్లో ఆరోగ్యకరమైన పోటీని ప్రభావితం చేయడంతో పాటు భద్రత, పనితీరు విషయంలో కస్టమర్స్‌ని తప్పుదారి పట్టిస్తున్నది.
ఈ నెల ప్రారంభంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) భారతదేశంలో ఉపయోగించే 50శాతం కంటే ఎక్కువ లిథియం బ్యాటరీలను సరఫరా చేసిన రెండు చైనీస్ బ్యాటరీ సరఫరాదారుల రిజిస్ట్రేషన్లను చేసింది. గ్వాంగ్డాంగ్ క్వాసన్ న్యూ ఎనర్జీ టెక్నాలజీ, గన్జౌ నావెల్ బ్యాటరీ టెక్నాలజీ లైసెన్స్‌లను రద్దు చేయగా.. గన్జౌ టావోయువాన్ న్యూ ఎనర్జీ విచారణ జరుపుతున్నది. అధికార వర్గాలు నిర్వహించిన టెస్టుల్లో చాలా పవర్ బ్యాంక్‌లు కంపెనీలు ప్రకటించిన సామర్థ్యానికి అనుగుణంగా లేవని గుర్తించారు. ఉదాహారణకు 10వేల ఎంఏహెచ్ బ్యాటరీ అని విక్రయిస్తే.. దాని సామర్థ్యం 4-5వేల ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్నట్లు గుర్తించారు. ఆయా కంపెనీలు బీఐఎస్ ఆమోదం కోసం పరిమిత సంఖ్యలో నిబంధనల మేరకు పవర్ బ్యాంకులను తయారు చేసి పంపాయి. ఆ తర్వాత కంపెనీలు తక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీలను భారతీయ బ్రాండ్లకు విక్రయిస్తున్నాయి. ఈ నాసిరకం బ్యాటరీలు ధరలో 25శాతం వరకు తగ్గగా.. వినియోగదారులు నాసిరకం ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సి వచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

