ఎల్ఐసీ జీవన్ ధార II
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) శుక్రవారం ఓ సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది. ‘
ముంబై, జనవరి 19: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) శుక్రవారం ఓ సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది. ‘జీవన్ ధార II (ప్లాన్ 872)’ పేరుతో దీన్ని సంస్థ చైర్పర్సన్ సిద్ధార్థ మహంతి ప్రారంభించారు. సోమవారం నుంచి ఇది కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. ఇదో ఇండివిడ్యువల్, సేవింగ్స్, డిఫర్డ్ యాన్యుటీ, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్. దీని యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఐఎన్): 512N364V01. సంస్థ ఏజెంట్ల ద్వారాగానీ, ఇతర మధ్యవర్తిత్వ వేదికలద్వారానైనా లేదా నేరుగా ఆన్లైన్లో ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు.
పాలసీ విశేషాలు
- 20 ఏండ్లు దాటినవారే ఈ ప్లాన్‌కు అర్హులు. అలాగే ఎంచుకునే యాన్యుటీ ఆప్షన్నుబట్టి గరిష్ఠ వయస్సు 80, 70, 65 ఏండ్లుగా ఉన్నది.
- ప్లాన్ మొదలైన దగ్గర్నుంచి యాన్యుటీ హామీ ఉంటుంది. పాలసీదారులకు 11 యాన్యుటీ ఆప్షన్స్‌ను ఎల్ఐసీ అందుబాటులో ఉంచింది.
- వయసు పెరిగినకొద్దీ అధిక యాన్యుటీ రేట్లు అందుకోవచ్చు. అధిక ప్రీమియంలకు ప్రోత్సాహకాలు అందుతాయి.
- వాయిదాల వ్యవధిలో లైఫ్ కవరేజీ.
- పాలసీదారులు రెగ్యులర్, సింగిల్ ప్రీమియంలను ఎంచుకోవచ్చు.
- సింగిల్ లైఫ్ యాన్యుటీ, జాయింట్ లైఫ్ యాన్యుటీలుంటాయి.
- రెగ్యులర్ ప్రీమియంలో వాయిదా వ్యవధి ఐదేండ్ల నుంచి 15 ఏండ్లదాకా ఉంటుంది. సింగిల్ ప్రీమియంలోనైతే ఏడాది నుంచి 15 ఏండ్లు. మీ అవసరాలకు అనుగుణంగా యాన్యుటీ చెల్లింపులు మొదలైనప్పట్నుంచి ఇవి వర్తిస్తాయి.
- యాన్యుటీ చెల్లింపులు నెలకోసారి, 3 నెలలకోసారి, 6 నెలలకోసారి, ఏడాదికోసారి చేసుకోవచ్చు.
- పాలసీ వ్యవధి వాయిదా కాలంలో ఎప్పుడైనాసరే సింగిల్ ప్రీమియంగా అదనపు మొత్తాన్ని చెల్లించి యాన్యుటీని పెంచుకునే వెసులుబాటు.
- ఈ ప్లాన్‌లో పాలసీదారుడు చనిపోతే వచ్చే ఆ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాల్లో నామినీలు తీసుకోవచ్చు. ఇందుకు తగ్గట్టుగా ఆ మేరకు ఆయా ప్రయోజనాలు అందుతాయి.
- పాలసీపై రుణ సదుపాయం లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

