LIC | గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఎల్ఐసీ.. 24 గంటల్లో 5,88,107 పాలసీలతో ప్రపంచ రికార్డు..!
LIC | లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకెక్కింది. 24 గంటల్లో 5,88,107 జీవిత బీమా పాలసీలు జారీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది ఎల్ఐసీ. ఈ సందర్భంగా ఎల్ఐసీ ఓ ప్రకటన విడుదల చేసింది.
LIC | లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకెక్కింది. 24 గంటల్లో 5,88,107 జీవిత బీమా పాలసీలు జారీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది ఎల్ఐసీ. ఈ సందర్భంగా ఎల్ఐసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సంవత్సరం జనవరి 24న దేశవ్యాప్తంగా 4,52,839 మంది ఎల్ఐసీ ఏజెంట్లు కలిసి 24 గంటల్లో మొత్తం 5,88,107 జీవిత బీమా పాలసీలను జారీ చేశారని, ఇది ఓ ప్రపంచ రికార్డు అని జీవిత బీమా సంస్థ తెలిపింది. ఈ ఘనత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైని పేర్కొంది. ఇది ఘనత తమ ఏజెంట్ల అంకితభావం, నైపుణ్యం, అవిశ్రాంత కృషికి నిదర్శనమని ఎల్ఐసీ చెప్పుకొచ్చింది.
Read Also : EPFO | ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును ప్రకటించిన కేంద్రం.. ఈ సారి ఎంతో తెలుసా..?
ఈ గొప్ప ప్రయత్నం కేవలం 24 గంటల్లోనే జీవిత బీమా పరిశ్రమలో కొత్త ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పిందని.. ఈ విజయం మా కస్టమర్లకు, వారి కుటుంబాలకు కీలకమైన ఆర్థిక భద్రతను అందించే మా లక్ష్యం పట్ల తమ లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఈ రికార్డు కోసం ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ్ మొహంతి చొరవ చూపారు. ఈ ఏడాది జనవరి 20న ‘మ్యాడ్ మిలియన్ డే’ రోజున ప్రతి ఏజెంట్ కనీసం ఒక పాలసీని పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మ్యాడ్ మిలియన్ డే’ని చారిత్రాత్మకంగా మార్చినందుకు కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు మొహంతి కృతజ్ఞతలు తెలిపారు.
Read Also : Donald Trump | యాపిల్నేకాదు.. శాంసంగ్‌నూ టార్గెట్ చేసిన ట్రంప్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

