హైదరాబాద్, మే 1: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణాసియాలో అతిపెద్ద అత్యాధునిక హైడ్రోపోనిక్ వ్యవసాయ క్షేత్రమైన లెమోన్చిల్లీ ఫార్మ్స్..దేశవ్యాప్తంగా చిన్న తరహా గ్రీన్హౌస్ రైతులకు సహాయ సహకారాలు అందించేందుకుగాను డచ్ డెలిగేషన్తో జట్టుకట్టింది.
దేశీయ రైతులు ఎదుర్కొంటున్న రోజువారీ సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన నైపుణాన్ని అందించేందుకు ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. రైతులకు సమగ్ర శిక్షణ అందించడానికి క్షేత్ర స్థాయిలో నిపుణులను తయారు చేయనున్నారు.