గ్లోబల్ సంస్థలతో లారస్ ల్యాబ్స్ ఒప్పందం

- పిల్లల హెచ్ఐవీ చికిత్సా ఔషధం కోసం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: పిల్లల్లో హెచ్ఐవీ చికిత్స కోసం ఔషధాన్ని అభివృద్ధిపర్చేందుకు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లారస్ ల్యాబ్స్ గ్లోబల్ సంస్థలతో చేతులు కలిపింది. యునిటైడ్, క్లింటన్ హెల్త్ యాక్సెస్ ఇనిషియేటివ్ (సీహెచ్ఏఐ)లతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు లారస్ ల్యాబ్స్ మంగళవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఒప్పందం ప్రకారం హెచ్ఐవీ/ఎయిడ్స్ కలిగిన పిల్లలు జీవించేందుకు అవసరమైన డ్రగ్‌ను యునిటైడ్, సీహెచ్ఏఐలతో కలిసి అభివృద్ధిపరుస్తున్నామని లారస్ తెలిపింది. హెచ్ఐవీ కలిగినవారిలో 90 శాతం మంది జీవించి ఉండేందుకు ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఉపయోగపడుతుందని యూనిటైడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫిలిప్పీ డునేటన్ తెలిపారు. హెచ్ఐవీ పిల్లల జీవితాల్ని ఈ డ్రగ్ కాపాడుతుందని క్లింటన్ హెల్త్ సీఈవో అన్ వెనెమాన్ పేర్కొన్నారు. డ్రగ్ అభివృద్ధిపర్చే అవకాశం పట్ల లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, సీఈవో సత్యనారాయణ చావా సంతోషాన్ని వ్యక్తంచేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

