Seerum tieup Biocon | కిరణ్ మజుందార్-ఆధార్ పూనావాలా జట్టు! ఎందుకంటే?!
Seerum tieup Biocon | కరోనాపై పోరుకు బయోకాన్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా జత కట్టనున్నాయని సమాచారం.

Seerum tieup Biocon | కరోనా మహమ్మారి ఆట కట్టించేందుకు ప్రపంచవ్యాప్త అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉంది. అందుకోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ), బయోకాన్ చేతులు కలుపనున్నాయా.. అవుననే వార్తలొస్తున్నాయి. తమ పరపతికి అనుగుణంగా భారీ మొత్తంలో ఉత్పాదక సామర్థ్యం గల యూనిట్ల నిర్మాణంపై సీరం సీఈవో అదార్ పూనావాలా దృష్టిని కేంద్రీకరించారని సమాచారం. అందుకోసం బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్‌షాతో చర్చలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల పంపిణీకి మార్గాలను ఇరు సంస్థల అధినేతలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
వ్యాక్సిన్ల సరఫరాలో అసమానతలు
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల సరఫరాలో భారీ అసమానతలు చోటు చేసుకున్నాయి. టీకాల కోసం ప్రపంచ దేశాల నుంచి వస్తున్న డిమాండ్లను అందుకోవడంలో ఫార్మా సంస్థలు వెనుక పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాము కలిసి పని చేసే అవకాశాలను అదార్ పూనావాలా, కిరణ్ మజుందార్ షా పరిశీలిస్తున్నట్లు వినికిడి. ఇప్పటికే సీరం ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పాదక శక్తి సామర్థ్యాలను పెంచుకున్నది. మరింత పురోభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నదని సమాచారం.
దీర్ఘ కాల భాగస్వామ్యం కోసం కసరత్తు
బయోకాన్, సీరం మధ్య భాగస్వామ్యం దీర్ఘకాలం కొనసాగించడం ద్వారా భారీ అవకాశాలు పొందొచ్చు. ఈ ఏడాది తర్వాత కోవిడ్ వ్యాక్సిన్లకు డిమాండ్ తగ్గవచ్చు.. అయినా తర్వాత దశలోనూ మలేరియా, హెచ్‌పీవీ తదితర ప్రపంచ దేశాల అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ల తయారీలో తమ భాగస్వామ్యం కొనసాగాలని సీరం, బయోకాన్ భావిస్తున్నాయని సమాచారం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

