కార్వీ స్టాక్ బ్రోకింగ్ ఉపాధ్యక్షుడి అరెస్ట్!
Karvy Stock broking | మదుపర్ల పెట్టుబడులను 9 డొల్ల సంస్థల్లోకి తరలించిన కార్వీ వైస్ ప్రెసిడెంట్ శ్రీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: కార్వీ రుణాల కుంభకోణం కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఉపాధ్యక్షుడు శ్రీకృష్ణను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్వెస్టర్లు కొనుగోలు చేసిన షేర్లను నిబంధనలకు విరుద్ధంగా.. స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తెలియకుండా తొమ్మిది డొల్ల కంపెనీల్లోకి మళ్లించడంలో శ్రీకృష్ణ పాత్ర ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
సెబీకి చెప్పకుండా సదరు షేర్లను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి కార్వీ స్టాక్ బ్రోకింగ్ రూ.1500 కోట్ల రుణాలు తీసుకున్నది. ఈ రుణాలను కూడా శ్రీకృష్ణ సదరు తొమ్మిది డొల్ల కంపెనీలకు మళ్లించారు. ఆయన మదుపర్లకు నష్టం కలిగించడంతోపాటు రుణాలను రూల్స్‌కు భిన్నంగా దారి మళ్లించారని పోలీసులు గుర్తించారు.
ఇప్పటికే ఈ కేసులో కార్వీ చైర్మన్ పార్ధసారధి, సీఈవో కృష్ణ హరి, సీవోవో రాజీవ్ సింగ్, కంపెనీ కార్యదర్శి శైలజలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కార్వీ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు ఆయా బ్యాంకులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- karvy
- stock broking
RELATED ARTICLES
తాజా వార్తలు
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

