కార్వీ స్కాం.. సంస్థ సెక్రటరీ అరెస్ట్?
కార్వీ స్కాం.. సంస్థ సెక్రటరీ అరెస్ట్ ? | కార్వీ ఎండీ పార్ధసారధి కేసు శుక్రవారం మరో మలుపు తిరిగింది. ఆ సంస్థ కార్యదర్శిగా పని చేస్తున్న శైలజను...

హైదరాబాద్: బ్యాంకులకు రుణాల ఎగవేతకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న కార్వీ ఎండీ పార్ధసారధి కేసు శుక్రవారం మరో మలుపు తిరిగింది. ఆ సంస్థ కార్యదర్శిగా పని చేస్తున్న శైలజను శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ సైబర్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య నలుగురికి చేరింది.
ఇదే కేసులో ఇద్దరు నిందితులను గురువారం సెంట్రల్ సైబర్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరు సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ సింగ్, మరొకరు చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ కృష్ణహరి ఉన్నారు. వీరిద్దరు నకిలీ షెల్ కంపెనీలతో మోసాలకు పాల్పడ్డారని సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు.
కార్వీ ఎండీ పార్థసారథి సూచన మేరకే నిందితులు రాజీవ్ రంజన్ సింగ్, కృష్ణహరి నకిలీ షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. కాగా, నిందితులిద్దరు 2014 నుంచి షెల్ కంపెనీలను నడుపుతున్నారని సీసీఎస్ పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు పార్థసారథిపై సీసీఎస్ పోలీసులు 4 కేసులను నమోదు చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

