కార్వీ స్కాం విలువ రూ.2700 కోట్లు? మళ్లీ పార్ధసారధికి రెండ్రోజుల కస్టడీ.. !
కార్వీ స్కాం విలువ రూ.2700 కోట్లు? | కార్వీలో కుంభకోణం గుట్టును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వెలికి తీశారు. ఈ కుంభకోణం మొత్తం విలువ రూ.2700 కోట్లు అని ....

హైదరాబాద్: ప్రముఖ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ కార్వీలో కుంభకోణం గుట్టును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వెలికి తీశారు. ఈ కుంభకోణం మొత్తం విలువ రూ.2700 కోట్లు అని నిగ్గు తేల్చారు. సకాలంలో రుణాలు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడిన కార్వీ చైర్మన్ పార్ధసారధిపై బ్యాంకుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు రెండు రోజుల కస్టడీ ముగిసిపోవడంతో శనివారం మరోమారు కస్టడీకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈసారి రెండు రోజుల కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆది, సోమవారాల్లో మరోమారు పార్ధసారధిని పోలీసులు విచారిస్తారు.

ఇప్పటికే జరిగిన విచారణలో పార్థ సారధి నుంచి కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. కస్టమర్ల షేర్లను కంపెనీ షేర్లుగా చూపిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ.. బ్యాంకుల నుంచి రుణాలు పొందింది. రూ.780 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు పార్ధసారధి చెప్పారు. ఆస్తులు అమ్మైనా కస్టమర్ల అప్పులు తీరుస్తానని చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, పీటీ వారెంట్‌పై ఆయనను తీసుకెళ్లి విచారించేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు కసరత్తు చేస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- karvy
- pardha sarathi
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

