హైదరాబాద్, ఫిబ్రవరి 18: దేశంలో అతిపెద్ద సిరామిక్ అండ్ విట్రిఫైడ్ టైల్ తయారీసంస్థ కజారియా..హైదరాబాద్‌లో అతిపెద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ అన్ని రకాల టైల్స్ లభించనున్నాయని కంపెనీ ఎండీ రిషీ కజారియా తెలిపారు. టైల్స్, బాత్, శానిటరీవేర్ ఉత్పత్తులను ప్రతీ కుటుంబానికి అందించడం లక్ష్యంలో భాగంగా ఈ సెంటర్‌ను నెలకొల్పినట్లు చెప్పారు.
స్టార్టప్‌లకు బ్రెజిల్ దన్ను
హైదరాబాద్, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. దేశీయ స్టార్టప్‌లకకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో టీహబ్..బ్రెజిల్‌కు చెందిన గోయాస్ హబ్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో టీ హబ్ పౌండేషన్ సీఈవో సుజిత్, గోయాస్ స్టేట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెక్రటరీ జోస్ ప్రెడెరికో లైరా నెట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో తెలంగాణ స్టార్టప్‌లకు బ్రెజిల్లో, అలాగే బ్రెజిల్ స్టార్టప్‌లకు ఇక్కడ అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా కృత్రిమ మేధస్సు, ఐటీ, అగ్రి-టెక్, హెల్త్ కేర్, బయోటెక్, మైనింగ్ తదితర రంగాల్లో పరస్పర సహకారం ఉంటుందని వారు వివరించారు.