ఎల్ఐసీ ఐపీవోతో ఉద్యోగ నష్టాలు
- ఇన్ఫ్రా రంగానికి దెబ్బ
- ఎల్ఐసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విమర్శ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: బీమా దిగ్గజం ఎల్ఐసీలో 10 శాతం వాటాను తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా విక్రయించడం సామాజిక మౌలిక సదుపాయాలకు దెబ్బతగులుతుందని, పలు ఉద్యోగాలు పోతాయంటూ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విరుచుకుపడింది. పెద్ద ట్రేడ్ యూనియన్లలో ఒకటైన ఆల్ ఇండియా ఎల్ఐసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్ ఒక ఆంగ్లఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విమర్శలు చేశారు. గ్రామీణులకు, ఆర్థికంగా వెనుకబడ్డవారికి బీమా సేవలు అందించేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ను నెలకొల్పారని, ఐపీవోతో ఈ ప్రధాన ఉద్దేశ్యం నీరుకారిపోతుందని, సంస్థ లాభాల కోసమే పనిచేస్తుందని ఆయన దుయ్యబట్టారు. అలాగే భారీ మూలధనం అవసరమైన రోడ్లు, రైల్వేలు, విద్యుత్ తదితర ఇన్ఫ్రా ప్రాజెక్టులకు ఎల్ఐసీ ఆరు దశాబ్దాలుగా నిధులు అందిస్తున్నదని, ఐపీవో తర్వాత లాభాల్ని గరిష్ఠపర్చుకునే ప్రాజెక్టులకే పెట్టుబడులు మళ్లిస్తుందని ఆయన హెచ్చరించారు.
ప్రధానికి లేఖ&
నరేంద్ర మోది నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన భారీ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలో భాగంగా ఎల్ఐసీలో 10 వాటాను మార్కెట్లో విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలన్న ప్రతిపాదనపై నిరసన వ్యక్తంచేస్తూ ప్రధాన మంత్రికి, పార్లమెంటు సభ్యులకు లేఖలు రాసినట్లు కుమార్ తెలిపారు. ఈ వాటా విక్రయాన్ని నిరసిస్తూ ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఐపీవో తర్వాత ఎల్ఐసీలో రిక్రూట్మెంట్స్ తగ్గిపోతాయని, అవుట్‌సోర్సింగ్‌తో ఉద్యోగుల్ని తొలగిస్తారంటూ ఆయన హెచ్చరించారు. జాతీయ ఆస్తిని అమ్మడం ఉద్దేశ్యపూర్వక తప్పుడు విధానంగా తాము భావిస్తున్నామని కుమార్ అన్నారు. ఎల్ఐసీ వాటా విక్రయం కోసం కేంద్ర ప్రభుత్వం గత నెలలో 10 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల్ని నియమించింది. 2022 జనవరి-మార్చి మధ్యకాలంలో పబ్లిక్ ఆఫర్ జారీచేయాలని డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ భావిస్తున్నది.
ఎల్ఐసీతో పోస్టల్ బ్యాంక్ జట్టు
ఖాతాదారులకు గృహ రుణ సౌకర్యం
ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌తో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) చేతులు కలిపింది. తమ 4.5 కోట్ల మంది ఖాతాదారులకు గృహ రుణ సౌకర్యార్థమే ఎల్ఐసీ హౌజింగ్తో ఐపీపీబీ ఈ వ్యూహాత్మక జోడీ కట్టింది. దేశవ్యాప్తంగా తమ కస్టమర్లు ఇకపై ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ ద్వారా గృహ రుణాలను పొందవచ్చని మంగళవారం ఐపీపీబీ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఐపీపీబీకి 650 శాఖలు, 1,36,000 బ్యాంకింగ్ యాక్సెస్ పాయింట్లున్నాయి. ఉద్యోగులకు రూ.50 లక్షల వరకు గృహ రుణాలను 6.66 శాతం ప్రారంభ వడ్డీరేటుకే ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ మంజూరు చేస్తున్నది. కాగా, ఐపీపీబీ ఇప్పటికే జనరల్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఆయా బీమా రంగ సంస్థలతో పొత్తు పెట్టుకుని ఖాతాదారులకు అందిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Job losses
- LIC IPO
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

