JioPhone Next Registration | ముందు రిజిస్ట్రేషన్.. .జియోఫోన్ నెక్ట్స్ పట్టు.. సేల్స్ షురూ!
JioPhone Next Registration | జియో ఫోన్ నెక్ట్స్ కావాలనుకునే యూజర్లు ముందుగా వాట్సాప్ ద్వారా గానీ, వెబ్ సైట్ లో గానీ పేరు రిజిస్టర్ చేసుకోవాలి.

JioPhone Next Registration | సెర్చింజన్ గూగుల్‌తో కలిసి రిలయన్స్ జియో రూపొందించిన స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్ విపణిలోకి వచ్చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ స్టోర్లలో లభ్యం అవుతోంది. ఈ ఫోన్ కొనుగోలు చేయాలని భావించే యూజర్లు స్టోర్‌కు వెళ్లడానికి ముందు వాట్సాప్ ద్వారా గానీ, జియో వెబ్సైట్ ద్వారా గానీ పేరు నమోదు చేసుకోవాలని రిలయన్స్ కోరింది. ఆసక్తి గల యూజర్లు వాట్సాప్ నంబర్ 7018270182 నంబర్‌కు వివరాలు పంపి తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఆ సమాచారాన్ని యూజర్ సమీపంలోని రిటైల్ స్టోర్‌కు పంపుతారు. అక్కడికి వెళ్లి సదరు యూజర్ జియోఫోన్ నెక్ట్స్ కొనుగోలు చేయొచ్చు.
రిజిస్ట్రేషన్ చేసుకోకుండా జియో ఫోన్ నెక్ట్స్ కొనుగోలు చేయడం కష్టసాధ్యం అని రిలయన్స్ డిజిటల్ స్టోర్ ప్రతినిధి చెప్పారు. జియో ఫోన్ల కొనుగోళ్ల కోసం ఈఎంఐలను రిలయన్స్ ఆఫర్ చేస్తోంది. ప్రారంభంలో రూ.1,999 చెల్లిస్తే మిగతా మొత్తం రుణ వాయిదాల్లో చెల్లించొచ్చు. ప్రారంభంలో చెల్లించే రూ.1,999లో ప్రాసెసింగ్ ఫీజు రూ.501 కూడా కలిపి ఉంది. దేశవ్యాప్తంగా 30 వేలకు పైగా రిటైల్ స్టోర్లతో రిలయన్స్ జియో భాగస్వామ్యం కలిగి ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Jiophone Next
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

