JioBharat J1 4G | మార్కెట్లోకి జియో మరో బడ్జెట్ ఫీచర్ ఫోన్ జియోభారత్ జే1 4జీ.. రూ.1,799లకే లభ్యం..!
JioBharat J1 4G | రిలయన్స్ జియో.. దేశీయ మార్కెట్లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్ జియో భారత్ జే1 4జీ (JioBharat J1 4G) ఫోన్ ఆవిష్కరించింది.
JioBharat J1 4G | రిలయన్స్ జియో.. దేశీయ మార్కెట్లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్ జియో భారత్ జే1 4జీ (JioBharat J1 4G) ఫోన్ ఆవిష్కరించింది. 4జీ కనెక్టివిటీతో దేశీయ మార్కెట్లో ప్రవేశ పెట్టిన ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్ ఇది అని పేర్కొంది. జియో స్పెషల్ జియో భారత్ ప్లాన్ కు మద్దతుగా బడ్జెట్ ఆఫర్ ఫోన్ అందిస్తోంది. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి యాప్స్ ప్రీ-ఇన్ స్టల్ చేసింది. రేర్ కెమెరా యూనిట్ తో మార్కెట్ లో అందుబాటులో ఉంది. గతేడాది అక్టోబర్లో ఆవిష్కరించిన జియో భారత్ బీ1 4జీ ఫోన్తో జత కలుస్తుంది.
డార్క్ గ్రే కలర్ ఆప్షన్లో లిస్టయిన ఈ ఫీచర్ ఫోన్ అమెజాన్ ద్వారా రూ.1,799లకు లభిస్తుంది. జియోభారత్ జే1 4జీ ఫోన్ డెడికేటెడ్ నేవిగేషన్ ప్లస్ ఫిజికల్ కీప్యాడ్తోపాటు 2.8 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ఈ ఫోన్ థ్రెడ్ఎక్స్ ఆర్టీఓఎస్ (Threadx RTOS) వర్షన్ పై పని చేస్తుంది. 0.13 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ కెపాసిటీతో వస్తున్న ఈ ఫోన్ లో స్టోరేజీ కెపాసిటీని 128 జీబీ వరకూ పెంచుకోవచ్చు.
నెలవారీగా 14జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందించే రూ.123.. 4జీ రీచార్జి ప్లాన్ అందిస్తుంది. ముందస్తుగా ఇన్ స్టల్ చేసిన జియో టీవీ యాప్ ద్వారా పలు రీజనల్ చానెళ్లతో కలిసి 455+ చానెళ్లు పొందొచ్చు. యూపీఐ లావాదేవీలు తేలిగ్గా జరిపేందుకు జియో పే యాప్ కూడా వినియోగించుకోవచ్చు. జియో భారత్ జే4 ఫోన్ 2500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. 3.5 ఎంఎం ఆడియో జాక్, రేర్ లో డిజిటల్ కెమెరా యూనిట్, ఆన్ లైన్ పేమెంట్స్ కోసం యూజర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి కెమెరా ఉపకరిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

