రూ.15 లక్షల కోట్లు.. ప్రపంచ కుబేరుల్లో ఇంకా టాప్‌లోనే బెజోస్

న్యూయార్క్: విడాకులు తీసుకొని భార్యకు భారీ భరణం చెల్లించినా, తాను స్థాపించిన సంస్థ అమెజాన్ సీఈవో పదవి నుంచి తప్పుకున్నా.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఇంకా టాప్‌లోనే ఉన్నారు జెఫ్ బెజోస్. తాజాగా బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం బెజోస్ సంపద విలువ 20300 కోట్ల డాలర్లు (సుమారు రూ.15 లక్షల కోట్లు). స్పేస్ బిజినెస్‌పై కన్నేసిన బెజోస్.. సోమవారం అమెజాన్ సీఈవో పదవిని ఆండీ జాసీకి కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే అమెజాన్‌కు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆయన కొనసాగుతారు. సంస్థలో మెజార్టీ వాటా కూడా బెజోస్ చేతుల్లోనే ఉంటుంది.
2019 నుంచి బెజోస్ సంపద ఏకంగా 73 శాతం పెరగడం గమనార్హం. ఈ మధ్య భార్య మెకంజీ స్కాట్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత భరణంగా తన కంపెనీ షేర్లలో 25 శాతం ఇవ్వాల్సి వచ్చినా.. ఆయన సంపద మాత్రం తగ్గలేదు. బెజోస్ సంపదలో మెజార్టీ వాటా అమెజాన్‌దే కాగా.. బ్లూ ఆరిజిన్, వాషింగ్టన్ పోస్ట్ మీడియా నుంచి మరికొంత మొత్తం వస్తుంది. 2020లో కరోనా కారణంగా ప్రపంచమంతా అల్లకల్లోలం కాగా.. అమెజాన్ ఈ-కామర్స్ బిజినెస్‌కు డిమాండ్ పెరగడంతో బెజోస్ సంపద భారీగా పెరిగింది.
దేశాల జీడీపీని మించిపోయి..
గతేడాది అమెజాన్ సీఈవోగా బెజోస్ 81,840 డాలర్లు అందుకున్నారు. ఇది కాకుండా అదనంగా పరిహారాల రూపంలో మరో 16 లక్షల డాలర్లు అందుకోవడం విశేషం. ఆయన సంపద ప్రస్తుతం కొన్ని దేశాల జీడీపీలనే మించిపోయిందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆయన ఓ సాధారణ అమెరికన్లా జీవించరని, ఇప్పటి వరకూ బెజోస్ అసలు పన్నులే చెల్లించరని ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ద్వారా సేకరించిన డేటాతో స్పష్టమైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

