ITR | ఐటీఆర్ దాఖలు చేయాలి.. ఇకపై గడువు పొడిగింపు ఉండదు : రెవెన్యూ కార్యదర్శి మల్హోత్రా
ITR | ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్‌లను త్వరగా దాఖలు చేయాలని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా కోరారు. జులై 31 గడువు సమీపిస్తుందని, ఇకపై పొడిగించే అంశాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ పరిగణలోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
ITR | ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్‌లను త్వరగా దాఖలు చేయాలని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా కోరారు. గడువు సమీపిస్తుందని, ఇకపై పొడిగించే అంశాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ పరిగణలోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు. జాతీయ మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది కంటే ఎక్కువగా ఫైలింగ్ జరుగుతుందని భావిస్తున్నామన్నారు. గతేడాదితో పోలిస్తే ఐటీఆర్ ఫైలింగ్ చాలావేగంగా ఉందని, రిటర్న్‌లు దాఖలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిజేస్తున్నామన్నారు.
చివరి క్షణం వరకు ఆగవద్దని, గడువు ముగింపు వరకు వేచిచూడొద్దని, పొడిగింపు ఉండవచ్చని ఆశించొద్దన్నారు. 2022-23 అసెస్మెంట్ ఇయర్‌కు జులై 31వ తేదీతో గడువు ముగుస్తుందని, వీలైనంత త్వరగా రిటర్నులను దాఖలు చేయాలని సూచించారు. వస్తు, సేవల పన్ను (GST) వృద్ధి రేటు విషయానికి వస్తే ఇది ఇప్పటి వరకు 12శాతంగా ఉందని తెలిపారు. రేట్ల తగ్గింపు కారణంగా ఎక్సైజ్ రంగంలో వృద్ధి రేటు 12శాతం కంటే తక్కువగా ఉందన్నారు. ప్రస్తుతానికి చాలా ప్రతికూలంగా ఉందని, ముందుకెళ్తున్న కొద్దీ పన్ను రేటు తగ్గింపు తర్వాత ఎక్సైజ్ సుంకం వసూళ్లలో వృద్ధిని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

