ITR Filing | గడువులోపు ఐటీఆర్ ఫైలింగ్.. టాప్ 5 బెనిఫిట్లు ఇవే
ITR Filing | గడువులోగా ఐటీఆర్ దాఖలుతో ఫైన్ నుంచి తప్పించుకోవడంతోపాటు పలు బెనిఫిట్లు పొందొచ్చు. లోన్ తేలికవుతుంది.
ITR Filing | గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. గడువు మరో రెండు రోజుల్లో ముగియనున్నది. రూ.2.5 లక్షల పై చిలుకు ఆదాయం గల వేతన జీవులు, పన్ను చెల్లింపు దారులు గడువులోగా ఐటీఆర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో పెనాల్టీలు, ఫైన్లు చెల్లించడం అదనపు భారంగా మారనున్నది. ఆదాయం పన్ను చట్టం-1961లోని 234ఎఫ్ సెక్షన్ కింద ఖరారు చేసిన పెనాల్టీలు, ఫైన్లను ఆదాయం పన్ను విభాగం (ఐటీ డిపార్ట్మెంట్ I-T department) ఖరారు చేస్తుంది. లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ నుంచి పన్ను మినహాయింపులు, డిడక్షన్లు క్లయిమ్ చేయడానికే ఐటీఆర్‌లు సాధారణంగా దాఖలు చేస్తారు. అయినా ఐటీఆర్ దాఖలు చేయడంతో బెనిఫిట్లు దీనికే పరిమితం కాలేదు. అవేమిటో చూద్దామా..!
ఫైన్లు, పెనాల్టీల సుంచి సేఫ్టీ
ఒకవేళ గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయకుంటే మీపై ఆదాయం పన్ను విభాగం ఫైన్ లేదా పెనాల్టీ విధించొచ్చు. ఒక్కోసారి మూడేండ్ల నుంచి ఏడేండ్ల వరకు జైలుశిక్ష కూడా విధించొచ్చు. అంతే కాదు.. ఐటీఆర్‌లు సబ్మిట్ చేయడం ఆలస్యమైతే రూ.5 లక్షలకు పైగా ఆదాయం గల వారు రూ.5000, రూ.5 లక్షల్లోపు ఆదాయం గల వారు రూ.1000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
రుణాలు తేలిక
ఒకవేళ మీరు ఏదైనా రుణం కావాలంటే.. చాలా బ్యాంకులు ఇప్పుడు ఐటీఆర్ ప్రతులు సమర్పించాలని కోరుతున్నాయి. రుణ గ్రహీతగా మీ ఆర్థిక హోదా, సామర్థ్యాన్ని ఖరారు చేయడంలో ఐటీ రిటర్న్స్ కీలకం అవుతాయి. ఒకవేళ ఐటీ రిటర్న్స్ సిద్ధంగా ఉంటే, రుణాల ప్రక్రియ వేగంగా ప్రాసెస్ అవుతుంది.
వేగంగా వీసా ప్రాసెస్
రుణాలతోపాటు విదేశాలకు వెళ్లే వారికి వీసా ప్రాసెస్ చేపట్టాలంటే సంబంధిత దేశానికి చెందిన ఎంబసీ అధికారులు ఐటీఆర్‌లు సబ్మిట్ చేయమని అడుగుతారు. తాజా ఐటీఆర్ పత్రాలు సమర్పిస్తే వీసా అప్లికేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుంది.
ఫ్రీలాన్సర్లకు సేఫ్టీ
ఫ్రీలాన్సర్ల వద్ద ఫామ్-16 ఉండదు. వారి వద్ద కేవలం తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రంగా ఐటీఆర్ మాత్రమే ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయట పడేందుకు ఐటీఆర్ సాయ పడుతుంది.
అధిక ఆరోగ్య బీమా కవరేజీ
పన్ను చెల్లింపుదారులకు మాత్రమే పలు కంపెనీలు భారీ ప్యాకేజీతో కూడి ఆరోగ్య బీమా కవరేజీ కల్పించడానికి ముందుకు వస్తాయి. ఒకవేళ పన్ను ఎగవేత దారైతే.. బ్యాంకులు ఆ వ్యక్తికి రుణాలు ఇవ్వాలా.. వద్దా.. నిర్ణయిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- benifits
- Business news
- itr
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

