Isuzu D-Max S-Cab Z | క్యాబ్ సర్వీసుల కోసం ఇసుజు డీ-మ్యాక్స్ ఎస్-క్యాబ్ జడ్ ఆవిష్కరణ.. ధరెంతంటే.. ?!
Isuzu D-Max S-Cab Z | క్యాబ్ సర్వీసుల కోసం ఇసుజు మోటార్స్ ఇండియా.. ఇసుజు డీ-మ్యాక్స్ ఎస్-క్యాబ్ జడ్ కారును ఆవిష్కరించింది. కారు ధర రూ.15 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Isuzu D-Max S-Cab Z | ఇసుజు మోటార్స్ ఇండియా గురువారం క్యాబ్ సర్వీసుల కోసం ఆల్ న్యూ డీ-మ్యాక్స్ ఎస్-క్యాబ్ జడ్ కారును దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కారు ప్రారంభ ధర రూ.15 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. 30కి పైనా న్యూ ఫీచర్లతో వస్తున్న ఈ కారు.. క్రూ-క్యాబ్ సెగ్మెంట్లో ‘బెస్ట్ ఇన్ క్లాస్’ అని పేర్కొంది.
ఎస్-క్యాబ్ జడ్ కారులో 2.5 లీటర్ల ఇసుజు 4జేఏ1 డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 78 హెచ్పీ విద్యుత్, 176 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్తో వస్తుంది.
ఈగల్ ఇన్స్పైర్డ్ క్రోమ్ గ్రిల్లె, బై-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. పవర్ అడ్జస్టబుల్ క్రోమ్ ఓఆర్వీఎంస్ విత్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. రూఫ్ రెయిల్స్, గన్ మెటల్ షార్క్ ఫిన్ యాంటీనా, న్యూ సిక్స్-స్పోక్ వీల్ కవర్స్ ఉంటాయి.
డీ-మ్యాక్స్ ఎస్-క్యాబ్ జడ్ కారు ‘కీ లెస్ ఎంట్రీ’ ఫీచర్ కలిగి ఉంటుంది. పియానో బ్లాక్-ఫినిష్డ్ ఎలిమెంట్స్ విత్ డ్యుయల్ టోన్ బ్లాక్ అండ్ డార్క్ గ్రే ప్రీమియం అప్ హోల్స్టరీ, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఆడియో సిస్టమ్ విత్ సిక్స్ స్పీకర్స్, మల్టీపుల్ యూఎస్బీ పోర్ట్స్, ఇంటిగ్రేటెడ్ రేర్ పార్కింగ్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి.
ఎస్-క్యాబ్ జడ్ లో డ్రైవర్, కో-డ్రైవర్ ఎయిర్ బ్యాగ్స్, ఐసోఫిక్స్ యాంకరేజెస్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్, ఫ్రంట్ అండ్ రేర్ క్రంపుల్ జోన్స్, క్రాస్ కార్ ఫ్రంట్ బీమ్, డోర్ సైడ్ ఇన్ట్రుషన్ ప్రొటెక్షన్, కొలాప్సిబుల్ స్టీరింగ్ కాలం, అండర్ బాడీ స్టీల్ ప్రొటెక్షన్ వంటి సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. ఐదు కలర్ ఆప్షన్స్ – కాస్మిక్ బ్లాక్, గాలెనా గ్రే, స్ప్లాష్ వైట్, నాటిలస్ బ్లూ, టైటానియం సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

