iQOO 13 | ఐక్యూ ప్రీమియం ఫోన్ ఐక్యూ13.. డిసెంబర్ 3న ఆవిష్కరణ.. ఇవీ డిటెయిల్స్..!
iQOO 13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ13 (iQoo 13) ఫోన్‌ను వచ్చేనెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
iQOO 13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ13 (iQoo 13) ఫోన్‌ను వచ్చేనెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. కస్టమైజబుల్ హలో లైట్ ఫీచర్‌తోపాటు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో వస్తోంది. గత నెలలో చైనా మార్కెట్లో ఆవిష్కరించిన ఐక్యూ 13 (iQoo 13) ఫోన్ భారత్ మార్కెట్లో రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మేరకు ఐక్యూ 13 ఫోన్ నార్డో గ్రే వేరియంట్ ను కంపెనీ బల పెట్టింది. డిసెంబర్ మూడో తేదీన మార్కెట్లో ఆవిష్కరిస్తుంది. మూడు కలర్ అసెంట్స్ తోపాటు వైట్ రేర్ ప్యానెల్ తో వస్తుందీ ఐక్యూ 13 ఫోన్. భారత్ మార్కెట్లో నార్డో గ్రే, లెజెండ్ ఎడిషన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
డెడికేటెడ్ క్యూ2 గేమింగ్ చిప్ తోపాటు 6.82 అంగుళాల 2కే (1,440×3168 పిక్సెల్స్) 2.0 ఓలెడ్ స్క్రీన్ విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ట్రిపుల్ రేర్ కెమెరాతో వస్తున్న ఐక్యూ 13 ఫోన్ లో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 120వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6,150 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

