iPhone 18 Pro : యాపిల్ నుంచి ఐఫోన్ కొత్త వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న యూజర్లకు గుడ్‌న్యూస్. ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ వేరియంట్స్ మరో రెండు నెలల్లో మార్కోట్లోకి రానున్నాయి. వచ్చే సెప్టెంబర్‌లో భారత వినియోగదారులకు ఈ ఫోన్లు అందుబాటులోకి తేవాలని యాపిల్ భావిస్తోంది. ఇండియాలో ఈ రకం ధర, ఫీచర్లు ఆకర్షణీయంగా ఉండనున్నాయి. ఐఫోన్ 18 కంటే కెమెరాను 18 ప్రోలో, 18 ప్రో మ్యాక్స్‌లో కెమెరా మరింత మెరుగ్గా ఉండనుంది.
కొత్తగా రాబోతున్న ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్‌లో ప్రత్యేక ఫీచర్లతో వస్తున్నాయి. వీటిలో బ్యాటరీ మరింత పెద్దగా ఉండనుంది. అలానే సరికొత్త ఏ20 ప్రో చిప్‌తో కూడిన కెమెరా అప్డేట్ ఉంటుంది. ఇవే కాకుండా.. ఆకర్షణీయమైన రంగులు, ఆకట్టుకునే డిజైన్లలో ఈ రెండు వేరియంట్లు రాబోతున్నాయి. అయితే.. కొత్తదనం కోరుకుంటున్న యూజర్లకు షాకిస్తూ.. ఫ్లాట్ ఎడ్జ్, ట్రిపుల్ కెమెరాతోనే ఈ వేరియంట్లు ఉండనున్నాయి. 18 ప్రో మోడల్ మునపటికంటే కాస్త మందంగా ఉంటుందని సమాచారం. దాంతో, పెద్ద బ్యాటరీలు.. వేపర్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు అనువుగా మారనుంది.

బ్యాటరీ మన్నిక కోసం వీటిలో ఎల్టీపీఓ ప్లస్ ఒలెడ్ డిస్ ప్లేకు రూపమిస్తున్నారని టాక్. 18 ప్రో మ్యాక్స్ బ్యాటరీ సామర్థ్యం 5,391ఎంఏహ్ నుంచి.. 5,500ఎంఏహెచ్ ఉంటుంది. రంగుల విషయానికొస్తే.. ముదురు చెర్రీ పండు కలర్‌తో పాటు లేత నీలం, వెండి.. ముదురు ఊదా రంగుల్లో ఉంటాయని చెబుతున్నారు. ఇక డిస్ ప్లే సంగతి చూస్తే.. 18 ప్రో 6.3 ఇంచులు, 18 ప్రో మ్యాక్స్ 6.9 ఇంచులతో ఉండడం ఖాయం. ఏఐ, సాఫ్ట్వేర్ వివరాల్లోకి వస్తే.. 18 ప్రోలో ఏఓఎస్ 27తో పాటు ‘సిరి’, ఆత్యాధునిక ఏఐ ఫీచర్లు పొందుపరచనున్నారు. 18 ప్రో ధర రూ. 1,39,900 నుంచి ఉండనుండగా.. 18 ప్రో మ్యాక్స్ ధర రూ.1,54,900 నుంచి మొదలవ్వనుంది.
బ్లూంబర్గ్స్ మార్క్ గుర్మన్ కథనం ప్రకారం.. సెప్టెంబర్ 8 మంగళవారం రోజున లాంఛ్ చేయాలని యాపిల్ అనుకుంటోంది. లేదంటే సెప్టెంబర్ 9 బుధవారం ఈ రెండు వేరియంట్లు భారత మార్కెట్లో అందుబాటలో ఉండే అవకాశముంది. అయితే.. అంతర్జాతీయ మీడియాకు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 9వ తేదీని ఖరారు చేస్తారని వినికిడి. సెప్టెంబర్ 18 నుంచి రిటైల్ స్టోర్లలో అమ్మకాలు మొదలవుతాయని గుర్మన్ పేర్కొంది.