ముంబై, జనవరి 12: వరుసగా ఏడు వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు కరిగిపోయాయి. ఈ నెల 5తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 5.90 బిలియన్ డాలర్లు తరిగిపోయి 617.30 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ తరిగిపోవడానికి ప్రధాన కారణమని విశ్లేషించింది.
గతవారాంతానికిగాను విదేశీ కరెన్సీ ఆస్తులు 4.97బిలియన్ డాలర్లుతగ్గి 546.65 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అలాగే పసిడి రిజర్వులు కూడా 839 మిలియన్ డాలర్లు తగ్గి 47.49 బిలియన్ డాలర్లకు తగ్గాయి.