ముంబై, జూన్ 12 : దేశీయ మారకం నిల్వలు కరిగిపోతున్నాయి. ఈ నెల 5తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 711 మిలియన్ డాలర్లు తరిగిపోయి 681.610 బిలియన్ డాలర్లకు పడిపోయాయని రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. విదేశీ కరెన్సీ రూపంలో రిజర్వులు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమని తెలిపింది.
అంతక్రితంవారంలో రిజర్వులు 938 మిలియన్ డాలర్లు ఎగబాకి 682.321 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న నిల్వలు 2.704 బిలయన్ డాలర్లు తరిగిపోయి 543.444 బిలియన్ డాలర్లకు పడిపోయాయని తెలిపింది. ఇదే సమయంలో గోల్డ్ రిజర్వులు 1.975 బిలియన్ డాలర్లు పెరిగి 114.575 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం.