న్యూఢిల్లీ, జూలై 27: ఇండియన్ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 41 శాతం ఎగబాకి రూ.1,709 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.11,758 కోట్ల నుంచి రూ.14,759 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంట్లో వడ్డీల మీద వచ్చే ఆదాయమే రూ.13,049 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 8.13 శాతం నుంచి 5.47 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 2.12 శాతం నుంచి 0.70 శాతానికి దిగొచ్చింది.