Nirmala on Russia Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోలు యధాతథం.. తేల్చేసిన నిర్మల !
Nirmala on Russia Crude Oil | రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు.
Nirmala on Russia Crude Oil |రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో భారత్‌కు డిస్కౌంట్‌పై రష్యా ముడి చమురు విక్రయిస్తున్నది.
రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు ప్రారంభం అయిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. గ్యాస్ సరఫరా సవాళ్లతో కూడుకున్నదని, అందువల్ల తగ్గించామన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాకు మద్దతు ఇవ్వొద్దని భారత్‌పై అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్జెయి్ లావ్రోవ్ భారత్‌లో పర్యటిస్తున్నారు.
రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, దాని మిత్ర దేశాలు పలు ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి ముడి చమురుతోపాటు దిగుమతులు చేసుకోవద్దని నిషేధించాయి. అంతర్జాతీయ నగదు లావాదేవీల వ్యవస్థ స్విఫ్ట్ నుంచి రష్యాను బహిష్కరించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

