India needs 4-5 SBI’s | భారత్కు నాలుగైదు ఎస్బీఐ తరహా బ్యాంకులు అవసరం.. నిర్మలా సీతారామన్
Indian needs 4-5 SBI's | భారత్కు నాలుగైదు ఎస్బీఐ తరహా బ్యాంకులు అవసరం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

India needs 4-5 SBI’s | దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి ఎస్బీఐ వంటి నాలుగైదు పెద్ద బ్యాంకులు అవసరం అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పరోక్షంగా మున్ముందు మరికొన్ని బ్యాంకుల విలీనం జరుగుతుందని సంకేతాలిచ్చారు. ముంబైలో ఆదివారం జరిగిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) 74వ వార్షిక సదస్సులో ఆమె కీలకోపన్యాసం చేస్తూ.. మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ విభిన్న మార్గం వైపు మళ్లుతున్నదన్నారు. రూపాంతరం చెందుతున్న బ్యాంకింగ్ వ్యవస్థకు పలు కొత్త సవాళ్లు ఎదురవుతాయని, వాటిని ఎదుర్కొనేందుకు పెద్ద బ్యాంకులు అవసరం ఉందని చెప్పారు.
బ్యాంకింగ్ సేవల్లో డిజిటల్ వ్యవస్థలకు ముఖ్య పాత్ర
సుస్థిర భారతీయ బ్యాంకింగ్ పరిశ్రమను సృష్టించడంలో నిరంతరాయ అనుసంధానమైన డిజిటల్ వ్యవస్థలు ముఖ్యపాత్ర పోషిస్తాయని నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలోనూ ప్రజలకు సేవల్లో అంతరాయం కలుగకుండా బ్యాంకుల విలీనాన్ని సజావుగా పూర్తి చేసినందుకు బ్యాంకులను ప్రశంసించారు.
ఎన్ఏఆర్సీఎల్ బ్యాడ్ బ్యాంక్ కాదు..
నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్), ఇండియా డెట్ రీసొల్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఐడీఆర్సీఎల్) ఏర్పాటులో కలిసి పని చేసినందుకు ఐబీఏకు మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు. వివిధ బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారం, పునర్వ్యవస్థీకరణలో ఎన్ఏఆర్సీఎల్, ఐడీఆర్సీఎల్ కలిసి పని చేస్తాయని చెప్పారు. ఎన్ఏఆర్సీఎల్ బ్యాడ్ బ్యాంక్ కాదని అన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

